Medak | ఎస్సి, ఎస్టిలను.. కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకుంటది: తిరుపతిరెడ్డి
Medak పోడుభూముల సర్వే పేరా గిరిజనులను ఆగం చేసిన ధరణీ పథకం రైతన్నలు ఎవరు కూడా బ్యాంకుల్లో అప్పు చెల్లించవద్దు మెదక్ ఆత్మగౌరవ యాత్రలో డీసీసీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి విధాత, మెదక్ బ్యూరో: గిరిజనులకు మూడెకరాల భూమిని ఇస్తామని… ఉన్న భూమిని ప్రభుత్వం ధరణి వ్యవస్థతో గిరిజనుల కడుపు కొట్టిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆరోపించారు. సోమవారం మెదక్ ఆత్మగౌరవ యాత్రలో భాగంగా మెదక్ జిల్లా నిజాంపేట మండలం లోని కాశింపూర్ […]

Medak
- పోడుభూముల సర్వే పేరా గిరిజనులను ఆగం చేసిన ధరణీ పథకం
- రైతన్నలు ఎవరు కూడా బ్యాంకుల్లో అప్పు చెల్లించవద్దు
- మెదక్ ఆత్మగౌరవ యాత్రలో డీసీసీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి
విధాత, మెదక్ బ్యూరో: గిరిజనులకు మూడెకరాల భూమిని ఇస్తామని… ఉన్న భూమిని ప్రభుత్వం ధరణి వ్యవస్థతో గిరిజనుల కడుపు కొట్టిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆరోపించారు. సోమవారం మెదక్ ఆత్మగౌరవ యాత్రలో భాగంగా మెదక్ జిల్లా నిజాంపేట మండలం లోని కాశింపూర్ తాండాలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి వివరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిజనులకు చెందాల్సిన 3 ఎకరాల భూమిని అందజేస్తామని ఆయన హామి ఇచ్చారు. ప్రభుత్వం పోడుభూముల సర్వే పేరా గిరిజనుల కడుపు కొట్టిందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం 15 వేల రూపాయలు ఇస్తామని తెలియజేశారు. బ్యాంకుల్లో ఉన్న అప్పులు ఏ రైతన్న కూడ కట్టవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటగా 2 లక్షల రూపాయల రుణమాఫి చేస్తామని ఆయన తెలిపారు.
నిజాంపేట మండలంలో డబుల్ బెడ్ రూంల ఎక్కడ?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలను పక్కత్రోవ పట్టించడానికి డబుల్ బెడ్ రూంల స్కీం పథకాన్ని ఆవిష్కరించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికి నేటికి నిజాంపేట మండలంలో డబుల్ బెడ్ రూంలు నిరుపేదలకు అందజేయలేదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెపుతారని, బిఆర్ఎస్ నాయకుల అవినీతిని కూడా బయటపెడుతారని ఆయన విమర్శించారు.
కార్యక్రమంలో పల్లె రాంచందర్ గౌడ్, లింగం గౌడ్, మహేందర్, మధుసూదన్ రెడ్డి, రాజయ్య, స్వామి, నజీర్, మధుసూదన్ రెడ్డి, విట్ఠల్, నరగౌడ్, సిద్దిరాములు, సులేమన్, బాణోత్ మోతిరమ్, చందు, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.