Medak | రాహుల్ గాంధీపై విమర్శలు.. కేటీఆర్ అహంకారానికి ప్రతీక: ఆంజనేయులు
Medak విధాత, మెదక్ బ్యూరో: రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం ఉన్నా మంత్రి పదవి కూడా తీసుకోకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కోసం దేశ సమగ్రత కోసం ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్‌కి ప్రధానమంత్రి అవకాశాన్ని కల్పించిన రాహుల్ గాంధీ పై మంత్రి కేటీఆర్ విమర్శ చేసే ముందు నీ వ్యక్తిత్వం గురించి ఆలోచించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పిసిసి అధికార ప్రతినిధి మామిళ్ళ ఆంజనేయులు విమర్శించారు. మెదక్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు […]

Medak
విధాత, మెదక్ బ్యూరో: రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం ఉన్నా మంత్రి పదవి కూడా తీసుకోకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కోసం దేశ సమగ్రత కోసం ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్‌కి ప్రధానమంత్రి అవకాశాన్ని కల్పించిన రాహుల్ గాంధీ పై మంత్రి కేటీఆర్ విమర్శ చేసే ముందు నీ వ్యక్తిత్వం గురించి ఆలోచించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పిసిసి అధికార ప్రతినిధి మామిళ్ళ ఆంజనేయులు విమర్శించారు. మెదక్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆనాడు పార్లమెంటును స్తంభింపజేసి మూజువాని ఓటు ద్వారా సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉంటే కేటీఆర్ నీ బతికేంది తెలంగాణ పేరు చెప్పి కెసిఆర్ పేరు చెప్పి మంత్రి పదవి అనుభవిస్తున్న నీవు రాహుల్‌ని విమర్శిస్తావా అని ధ్వజమెత్తారు. అనేక త్యాగాల చేసిన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి నీకు లేదు అని సూచించారు. రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డి ని విమర్శిస్తే కేటీఆర్, టిఆర్ఎస్ పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
2004లో ఉచిత కరెంటు పై తొలి సంతకం చేసి రైతులకు ఉచిత కరెంటు అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. తెలంగాణలో సోలార్ ప్లాంట్ అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఉచిత కరెంటు పేరుతో సంవత్సరానికి ₹8,000 కోట్ల రూపాయలు దిగముంగుతున్నది టిఆర్ఎస్ పార్టీ అని దుయ్యబట్టారు. 24 గంటల ఉచిత కరెంటు చెప్పి కేవలం ఎనిమిది గంటలే ఇస్తున్నది టిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. రాహుల్ గాంధీ పై రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తే సహించేది లేదు హెచ్చరించారు.
సమావేశంలో మెదక్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గూడూరు ఆంజనేయులు గౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సార శ్యాంసుందర్, మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, వెలిగంపూర్ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు లక్కర్ శ్రీనివాస్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రేమ్ సింగ్ రాథోడ్, యూత్ కాంగ్రెస్ మెదక్ నియోజకవర్గం అధ్యక్షులు రమేష్, ఎంపీటీసీ మైనార్టీ మెదక్ జిల్లా నాయకులు ఇస్మాయిల్ సూఫీ, సేవాదళ్ జిల్లా నాయకులు రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.