Medak | ఈసారి రాహుల్ గాంధీ ప్రధాని కాకుంటే నాపేరు హనుమంతరావు కాదు: వీహెచ్
Medak బీజేపీకి కాంగ్రెస్‌ను చూస్తే వణుకు పేదల గురించి ఆలోచించే కుటుంబం గాంధీ కుటుంబం చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి పని చేద్దాం కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నం పెట్టినోనికి సున్నం పెడతాడు కేసీఆర్ దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది మాజీ పీసీసి అధ్యక్షుడు హనుమంతరావు విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఈసారి రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవ్వడం ఖాయం లేకుంటే తనపేరు హనుమంతరావు కాదని వీహెచ్ సంచలన వాఖ్యలు చేశాడు. […]

Medak
- బీజేపీకి కాంగ్రెస్‌ను చూస్తే వణుకు
- పేదల గురించి ఆలోచించే కుటుంబం గాంధీ కుటుంబం
- చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి పని చేద్దాం
- కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది
- అన్నం పెట్టినోనికి సున్నం పెడతాడు కేసీఆర్
- దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది
- మాజీ పీసీసి అధ్యక్షుడు హనుమంతరావు
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఈసారి రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవ్వడం ఖాయం లేకుంటే తనపేరు హనుమంతరావు కాదని వీహెచ్ సంచలన వాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, గరిబీ హటావో అనే నినాదంతో పేద ప్రజలకు సేవ చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, రాష్ట్రంలో బీసీల భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు.
జనాభా ప్రతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. దీంతో బీజేపీ వెన్నులో వణుకు పుట్టిందని వీహెచ్ పేర్కొన్నారు. కులాల పేరుతో మనం కొట్టుకోకుండా ఐక్యంగా ఉండాలని, మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలన్నారు. పేదల గురించి ఆలోచించే కుటుంబం గాంధీ కుటుంబమన్నారు.
కష్టపడితే అధికారం మనదే..
కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా పార్టీలో బలోపేతానికి గట్టిగా కష్టపడితే అధికారం మనదేనని వీహెచ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీల భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ వస్తున్నారని, ఎప్పుడు సభ ఉంటుంది అనేది మళ్ళీ వచ్చి చెప్తానని తెలిపారు. ఈ సభను అందరు సక్సెస్ చేయాలన్నారు. చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి పని చేద్దామని, కేసీఆర్ మమ్మల్ని బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారని, నువ్వెందుకు వేస్తావు.. జనమే నిన్ను వేస్తారు బంగళాఖాతంలో అని వీహెచ్ ఎద్దేవా చేశారు.
సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దర్గా దగ్గర అల్లాకే బాబా దేదో అనే అడ్డుక్కునే వాడంటూ చురకలు అంటించారు. అన్నం పెట్టినోనికి సున్నం పెడతాడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది..
పప్పు అన్న మా రాహుల్ పప్పా అయ్యాడని మీ బాబై కూర్చున్నాడని బీజేపీని పరోక్షంగా వీహెచ్ విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఆదానికి మోడీకి ఎం సంబంధం అని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారన్నారు. మా దగ్గర ఉంటే అవినీతి పరులు… బీజేపీలో చెరితే సత్యహరిచంద్రులా అంటూ ప్రశ్నించారు.
అగ్ర కులాలకే కాదు రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్ ఉంటుందని, అగ్రకులాల వాళ్ళు ఓబీసీలను అనగదొక్కుతున్నారన్నారు. కొందరు లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అంటున్నారని, ఫస్ట్ 27 శాతం తెచ్చుకుందాం.. ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దామన్నారు.
జెండా మోసినవారిని పార్టీ మర్చిపోదు
పార్టీ లోకి ఎవరైనా రానివ్వండి అలాగే పార్టీ కోసం జెండా మోసినవారిని పార్టీ మర్చిపోదన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అడుగుతున్నామని, నేనెవ్వరికి వ్యతిరేకం కాదు మా హక్కుల కోసం మేం పోరాడుతున్నానన్నారు. ఫైనల్ గా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మాట వింటానని వీహెచ్ పేర్కొన్నారు.
ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ చెప్పి రైతులను జైల్లో వేయిస్తున్నాడని, పక్క రాష్ట్రాలకు వెళ్ళి సహాయం చేస్తున్నాడని విమర్శించారు. పార్టీలో సీనియర్లు జూనియర్ల మధ్య చిన్న చిన్న గోడవలున్నాయనిన్నారు. సీనియర్ మీద జూనియర్ పెత్తనం చెలాయిస్తా అంటే ఉరుకుంటారా మా పార్టీలో లొల్లి కూడా అంతేనని, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల తరుపున నేను మాట్లాడుతానని వీహెచ్ వెల్లడించారు.