Medak | ఎమ్మెల్సీ శేరిని కలిసిన రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన జేఏసీ
Medak సీఎం దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తానని హామీ విధాత, మెదక్ బ్యూరో: రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం జేఏసీ అధ్వర్యంలో ఉద్యమం చేపట్టి 100 రోజులు కావస్తున్న సందర్భంగా జేఏసీ నేతలు సీఎం రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డిని రామాయంపేట రెవెన్యూ సాధన సమితి జేఏసీ నాయకులు కలిశారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం సీఎం […]

Medak
- సీఎం దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తానని హామీ
విధాత, మెదక్ బ్యూరో: రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం జేఏసీ అధ్వర్యంలో ఉద్యమం చేపట్టి 100 రోజులు కావస్తున్న సందర్భంగా జేఏసీ నేతలు సీఎం రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డిని రామాయంపేట రెవెన్యూ సాధన సమితి జేఏసీ నాయకులు కలిశారు. అనంతరం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం సీఎం కేసీఅర్ ను కలిసి సమస్యను వివరించి రెవెన్యూ డివిజన్ సాధించుకుందాం అని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీని కలిసిన వారిలో జేఏసీ నేతలు సుంకోజి దామోదర్, పుట్టి అక్షయ్ కుమార్, పోచమ్మని శ్రీనివాస్, పోచమ్మని అశ్విని, చింతల శేఖర్, వినయ్ సాగర్, నరేష్, వెంకటి, సురేష్ నాయక్, ఎంపీటీసీ రాజిరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.