Medak
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఢిల్లీలో పార్టీ అధిష్టానం వర్గం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ అధ్యక్షులు నడ్డా పై విమర్శలు చేయడం… బీజేపీ పార్టీ కాదు, దుబ్బాకలో నా వ్యక్తిగతంగా గెలిచాను అని మీడియా ముందు వ్యాఖ్యా నించడంపై పార్టీ అధిష్టాన వర్గం సీరియస్ గా తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.
మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఒడిపాయారని..రఘునందన్ వ్యాఖ్యలపై పార్టీలో దుమారం రేపుతోంది. రఘునందన్ రావు బీజేపీలో చేరక ముందు నుండే గిరీష్ రెడ్డి రాష్ట్ర కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రామాయంపేట నియోజక వర్గం నుంచి బీజేపీ టిడిపి పొత్తులో భాగంగా రామన్నగారి వాసు రెడ్డి, సంగారెడ్డి నియోజక వర్గం నుండి పటాన్ చెరువు కు చెందిన సత్యనారాయణ బీజేపీ నుండి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
రఘునందన్ రావు పార్టీలో చేరక ముందే ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలంగా ఉండేదని అప్పటి కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటీకే గతంలో రఘునందన్ కు వ్యతిరేకంగా వాసు రెడ్డి, గిరీష్ రెడ్డి వర్గాలు ఒక్కటై అసమ్మతి నేతలు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడ పోతున్నారని బీజేపీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే గా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.
దుబ్బాక నియోజక వర్గం నుండి అప్పటి కలెక్టర్, ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి నీ పోటీ చేయించేందుకు సీఎం కెసిఆర్ పావులు కదిపినా మంత్రి హరీష్ రావు గట్టిగా వ్యతిరేకించి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికి టికెట్ ఇప్పించారు.. ఇప్పించడమే కాదు, అన్ని తానై ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.
సీఎం మాట హరీష్ రావు కాదన్నందుకు దుబ్బాక ఎన్నికల్లో సీఎం ప్రచార సభ పెట్టలేదని అందుకే సోలిపేట సుజాతా రామలింగా రెడ్డి కేవలం 600 ఓట్లతో రఘునందన్ రావు చేతిలో ఓడిపోయారు. ప్రగతి భవన్ సూచన మేరకు హరీష్ రావును కొంత మైనస్ చేసేందుకు అలాగే రఘునందన్ రావు తన సామాజిక వర్గం అయినందుకు సీఎంతో పాటు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు లు ప్రచారానికి రాలేదని ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు.
అప్పటి పరిస్థితుల్లో బీఆర్‌యస్ కు కంచుకోట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వంత మండలంలో సైతం 3 వేల కు పైగా బీజేపీకి మెజార్టీ రావడం అసలైన బీఆర్‌యస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రామ లింగారెడ్డి అనుచరులు జీర్ణించుకోలేక పోతున్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలో రెండు గ్రూపులుగా ఉన్నాయి. ఒక వర్గం రఘునందన్ రావు కు సపోర్ట్ చేయడంతోనే గెలిచారని అందరికీ తెలిసిన విషయమే.. బహిరంగ రహస్యమే.. నిజానికి మంత్రి హరీష్ రావు నిజాయితీగా పనిచేసినప్పటీకి అప్పట్లో ప్రగతి భవన్ స్కెచ్ అమలు జరిగిందని అంటుంటారు.
బీజేపీ జాతీయ అధిష్టానం పై ధిక్కార స్వరం వినిపించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీ మారనున్నారని ప్రచారం జరుగుతుంది. ఒక వేళ బీజేపీ నీ రఘునందన్ రావు వీడితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. లేదా గతంలో బీఆర్‌యస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా బీఆర్‌యస్ లోకి వెళ్తారు అని ప్రచారం జరుగుతుంది.
బీజేపీ అధిష్టానం పై రఘునందన్ రావు ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై పార్టీ సీరియస్ గా ఉందని చర్యలు తప్పవని మరోవైపు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా పాత బీజేపీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం రఘునందన్ రావు వ్యాఖ్యలపై లోలోపల మదన పడుతున్నారు.