Mega Princess | పండంటి బిడ్డకు జన్మనిచ్చిన చరణ్, ఉప్సీ దంపతులు

Mega Princess | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. వారికి.. మంగళవారం ఎర్లీ మార్నింగ్ అపోలో హాస్పిటల్‌లో ఓ బేబీ గాళ్‌ జన్మించినట్లుగా అపోలో డాక్టర్స్ అధికారికంగా తెలియజేశారు. సోమవారం సాయంత్రం ఉపాసన అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఆమె వెంట భర్త రామ్ చరణ్, అత్తగారు సురేఖ, ఆమె మదర్.. ఇంకొందరు కుటుంబ సభ్యులు ఉన్నారు. వారు హాస్పిటల్‌కు వెళుతున్న వీడియో వైరల్ అయింది. ఇక […]

  • By: krs    latest    Jun 20, 2023 12:44 AM IST
Mega Princess | పండంటి బిడ్డకు జన్మనిచ్చిన చరణ్, ఉప్సీ దంపతులు

Mega Princess |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. వారికి.. మంగళవారం ఎర్లీ మార్నింగ్ అపోలో హాస్పిటల్‌లో ఓ బేబీ గాళ్‌ జన్మించినట్లుగా అపోలో డాక్టర్స్ అధికారికంగా తెలియజేశారు. సోమవారం సాయంత్రం ఉపాసన అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఆమె వెంట భర్త రామ్ చరణ్, అత్తగారు సురేఖ, ఆమె మదర్.. ఇంకొందరు కుటుంబ సభ్యులు ఉన్నారు.

వారు హాస్పిటల్‌కు వెళుతున్న వీడియో వైరల్ అయింది. ఇక అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అయిన తర్వాత.. ఏ నిమిషంలోనైనా మెగా న్యూస్ వచ్చే అవకాశం ఉందని భావించిన మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్.. తెల్లవార్లు ఎంతగానో వెయిట్ చేశారు. చరణ్, ఉప్సీలకు పుట్టబోయే బిడ్డ కోసం పూజలు జరిపించారు. మంగళవారం ఎర్లీ మార్నింగ్.. ఉపాసన ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

పెళ్లయిన దాదాపు పదేళ్ల తర్వాత కలిగిన సంతానం కావడంతో.. మెగా ఇంట సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. వాస్తవానికి ఉపాసన గర్భవతి అని తెలిసినప్పటి నుంచి.. నిత్యం చరణ్, ఉపాసన వార్తలలో ఉంటూనే ఉన్నారు. పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన తీసుకున్న జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారిని పెంచే విధానంలో ఆమె తీసుకున్న డెసిషన్స్, బేబీ షవర్ సెలబ్రేషన్స్, ప్రముఖుల బ్లెసింగ్స్.. ఇలా ఏదో ఒక రకంగా ఉపాసన విషయంలో వార్తలు వినిపిస్తూనే వచ్చాయి.

రామ్ చరణ్ కూడా కొన్ని రోజులుగా షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి.. ఉపాసనతోనే ఉంటున్నారు. ప్రస్తుతం వారు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ వింటామా అని.. ఫ్యాన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తూ వస్తున్నారు. అందరి ప్రార్థనలు ఫలించాయి. మెగా ఫ్యామిలీలోకి మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం అపోలో హాస్పిటల్‌లో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లుగా డాక్టర్లు తెలియజేశారు.

ఇక మెగా వారసురాలిని చూసేందుకు మెగా, కామినేని ఫ్యామిలీ మెంబర్స్ అపోలో హాస్పిటల్‌కు చేరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. డెలీవరీ సమయంలో పక్కనే ఉన్న రామ్ చరణ్.. తన బిడ్డని చూసి ఎంతో మురిసిపోయినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. నిజంగా ఇది మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్‌కి ఆనందకరమైన క్షణాలు.

మరి ఈ ఆనందకరమైన, అపురూపమైన క్షణాలపై మెగాస్టార్ చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతారో అని.. మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. వారసుడే.. వారసుడే అని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేసిన మెగా ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయినప్పటికీ.. ఎవరైతే ఏంటీ అనేలా రియలైజ్ అవుతున్నారు. మెగాప్రిన్సెస్‌కు ఘన స్వాగతం పలుకుతున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.