సమంత అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

విధాత‌, సినిమా: సినీ న‌టీ సమంత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతుందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై సామ్ స్పందించింది. తాను అనారోగ్యం బారిన పడినట్టు చెప్పింది. ‘మయోసైటిస్’ (Myositis) అనే అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో అనేక మంది సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. pic.twitter.com/z43d9zqCei — Samantha (@Samanthaprabhu2) October 29, 2022 తాజాగా సామ్ అనారోగ్యం‌పై మెగాస్టార్ […]

  • By: Somu    latest    Oct 30, 2022 10:34 AM IST
సమంత అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

విధాత‌, సినిమా: సినీ న‌టీ సమంత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతుందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై సామ్ స్పందించింది. తాను అనారోగ్యం బారిన పడినట్టు చెప్పింది. ‘మయోసైటిస్’ (Myositis) అనే అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో అనేక మంది సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తాజాగా సామ్ అనారోగ్యం‌పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సామ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాలానుగుణంగా మన జీవితాల్లో సవాళ్లు ఎదురవుతుంటాయని, మనలోని అంతర్గత శక్తి ఏంటో తెలుసుకోడానికి ఆ సవాళ్లు ఉపయోగ పడుతాయన్నారు.