Jagadish Reddy | తెలంగాణ.. ఎక్కడ డబ్బులు ఎగ్గొట్టిందో చూపించు: కేంద్ర మంత్రికి మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్
Jagadish Reddy | కేంద్ర మంత్రి ఆర్కే సీంగ్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్ రుణాలు చెల్లించడంలో ముందున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మీటర్లు పెట్టనందుకే నిధులు ఆపుతున్నారు ఆర్థిక స్తోమత లేకనే రుణాలు ఆపామన్న కేంద్రమంత్రి ఆర్కే సింగ్ వాఖ్యలపై ఫైర్ శతాబ్ది కాలంలోనే అతి పెద్ద అబద్దమన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విధాత, హైదరాబాద్: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కు దమ్ముంటే తెలంగాణ రాష్ట్రం ఏ సంస్థ కైనా […]

Jagadish Reddy |
- కేంద్ర మంత్రి ఆర్కే సీంగ్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్
- రుణాలు చెల్లించడంలో ముందున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- మీటర్లు పెట్టనందుకే నిధులు ఆపుతున్నారు
- ఆర్థిక స్తోమత లేకనే రుణాలు ఆపామన్న కేంద్రమంత్రి ఆర్కే సింగ్ వాఖ్యలపై ఫైర్
- శతాబ్ది కాలంలోనే అతి పెద్ద అబద్దమన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
విధాత, హైదరాబాద్: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కు దమ్ముంటే తెలంగాణ రాష్ట్రం ఏ సంస్థ కైనా సకాలంలో చెల్లింపులు చేయకుండా నిలిపి వేసిందో చూపించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని జెన్ కో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో ముందున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా, రాష్ట్ర పేమెంట్ విధానానికి ముగ్గులై రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఆర్డిక సంస్థలను ఇవ్వకుండా బయపెడుతున్న దుర్మార్గం ఆర్కే సింగ్, కేంద్ర ప్రభుత్వాలదేనన్నారు.
ఆర్థిక స్తోమత లేకనే తెలంగాణకు రుణాలు ఆపామంటూ ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలు శతాబ్దికాలం లోనే అతి పెద్ద అబద్దం అన్నారు. తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమని తాము చెప్పలేదన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. మీటర్లు పెట్టనందుకే నిధులు ఆపుతున్నామని కేంద్ర ప్రభుత్వం పంపిన ఉత్తరాలను ఎన్నోసార్లు ప్రజల ముందు ఉంచామన్నారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేసే పనులతో దేశానికి తీరని ద్రోహం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కెసిఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మాకు సైతం కావాలంటూ బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ తోనే బిజెపి నాయకులు అసత్యపు వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి అన్నారు.
ఎన్ని అబద్ధాలు చెప్పినా కేసిఆర్ లక్ష్య సిద్దిని ఆపలేరని దుయ్యబట్టారు. ఇలాగే మాట్లాడితే పైసలు ఇవ్వమంటూ భయపెట్టే విధంగా చేసిన ఆర్కే సింగ్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం మర్చిపోదన్నారు. వాటా ఇవ్వకపోవడానికి తెలంగాణ ఆర్కే సింగ్ జాగిరు కాదు.. అది తెలంగాణ ప్రజల హక్కు అని మంత్రి అన్నారు. ప్రజలు చెల్లించిన పన్నులే అడుగుతున్నాం తప్పా కొత్తగా అడగట్లేదని స్పష్టం చేశారు.
బీజేపీకి దిక్కులేకనే..
తెలంగాణలో బిజెపికి దిక్కు లేదనే అక్కసుతోనే ఆర్కే సింగ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో మిగులు విద్యుత్ ఉన్నదనేది పెద్ద జోక్ అన్నారు. మిగులు విద్యుత్ ఉంటే ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంటు కోతలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.
రాత్రి పూట కరెంటు వాడితే 25 శాతం సర్ ఛార్జ్ విధిస్తామని కేంద్ర మంత్రి హోదాలో ఆర్కేసింగ్ చేసిన వ్యాఖ్యలు నిజం కాదా? అంటూ ఫైర్ అయ్యారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా 24 గంటల కరెంటు ఇచ్చి తీరుతామన్నారు. అబద్ధాలు చెప్పే వారికి ఎలా బుద్ధి చెప్పాలో తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నారు.