Minister Jagdish Reddy | కల్నల్ వీవీబీ రెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి ఘన నివాళులు
కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి విధాత: అరుణాచల్ ప్రదేశ్లో విధి నిర్వహణలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఉప్పల వినయ్ భాను రెడ్డి (Uppala Vinay Bhanu Reddy)కి మంత్రి జీ జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy) ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వినయ్ రెడ్డి భౌతికకాయాన్ని స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మలరామారంకు తీసుకవచ్చారు. ప్రభుత్వ, మిలటరీ లాంఛనాలతో లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. వినయ్ రెడ్డికి మంత్రి తో పాటు […]

- కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి
విధాత: అరుణాచల్ ప్రదేశ్లో విధి నిర్వహణలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఉప్పల వినయ్ భాను రెడ్డి (Uppala Vinay Bhanu Reddy)కి మంత్రి జీ జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy) ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వినయ్ రెడ్డి భౌతికకాయాన్ని స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మలరామారంకు తీసుకవచ్చారు. ప్రభుత్వ, మిలటరీ లాంఛనాలతో లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.
వినయ్ రెడ్డికి మంత్రి తో పాటు స్థానిక శాసనసభ్యురాలు గొంగొడి సునీత మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, రాచకొండ కమీషనర్ చౌహాన్ ప్రభృతులు నివాళులర్పించి అంత్యక్రియల అంతిమయాత్రలో పాల్గొన్నారు.
కల్నల్ వీవీబీ రెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి ఘన నివాళులు.
అరుణాచల్ ప్రదేశ్లో విధి నిర్వహణలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వుప్పల వినయ్ భాను రెడ్డి.
యాదాద్రి జిల్లా, బొమ్మలరామారంలో వీవీబీ రెడ్డికి ఘన నివాళులర్పించిన మంత్రి జగదీశ్ రెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులు. pic.twitter.com/hRSy4pmmNJ
— Jagadish Reddy G (@jagadishBRS) March 18, 2023
గ్రామస్తులు , గ్రామాల ప్రజలు, మిలిటరీ సభ్యులు పెద్ద సంఖ్యలో వినయ్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొని భారత్ మాతాకీ జై ..జై జవాన్ నినాదాలతో హోరెత్తించి, కడసారి కన్నీటి నివాళులు అర్పించారు.