విధాత, హైదరాబాద్ : నేను నల్లగొండ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా..నీవు సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేయ్.. ఇద్దరం సిరిసిల్లలో తలపడుదామని నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నీవు ఓడిపోతే పార్టీ మూసేస్తామని కేసీఆర్‌తో ప్రకటన చేయించాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. సచివాలయంలో శుక్రవారం మంత్రులు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు.
నేను సిరిసిల్లలో పోటీ చేసి గెలిస్తే ఇక కారు షెడ్డు మూసుకోవాలి అంతే అని ఎద్దేవా చేశారు. నాకు క్యారెక్టర్ ఉంది కాని నా దగ్గర డబ్బులు లేవన్నారు. కేటీఆర్ కు క్యారెక్టర్ లేదని, కాని ఆయన వద్ద లక్షల కోట్లు మాత్రం ఉన్నాయని విమర్శించారు. కేటీఆర్ సిరిసిల్లలో 200 కోట్లు ఖర్చు చేసి 30వేలతో గెలుస్తాడా అని, నేనైతే అంత చేసి అలా గెలిస్తే రాజీనామా చేసేవాడనని చెప్పారు. కేటీఆర్ కు టెక్నీకల్ నాలెడ్జీ లేదని, ఒక చిన్న పిలగాడని, నా స్థాయి కేటీఆర్ స్థాయి కాదని అన్నారు.