Minister KTR | హైద‌రాబాద్‌లో షూటింగ్ చేసి.. బెంగ‌ళూరు అని చెప్పుకుంటున్నారు: మంత్రి కేటీఆర్

విధాత‌: హైద‌రాబాద్ సిటీలో షూటింగ్‌లు చేసి.. సినిమాల్లోనేమో బెంగ‌ళూరు అని చూపిస్తున్నార‌ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. ఓ మ‌ల‌యాళం మూవీ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ న‌గ‌రంలో చిత్రీక‌రించి (Cinema Shooting), సినిమాలో బెంగ‌ళూరు అని చూపించార‌ని, అది చూసిన‌ప్పుడు నాకు చాలా ఒళ్లు మండింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఖాజాగూడ లేక్ వ‌ద్ద చెరువుల అభివృద్ధిపై నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. దుర్గం చెరువును ప్ర‌తి ఒక్క‌రూ చూసే ఉంటారని కేటీఆర్ పేర్కొన్నారు. […]

Minister KTR | హైద‌రాబాద్‌లో షూటింగ్ చేసి.. బెంగ‌ళూరు అని చెప్పుకుంటున్నారు: మంత్రి కేటీఆర్

విధాత‌: హైద‌రాబాద్ సిటీలో షూటింగ్‌లు చేసి.. సినిమాల్లోనేమో బెంగ‌ళూరు అని చూపిస్తున్నార‌ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. ఓ మ‌ల‌యాళం మూవీ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ న‌గ‌రంలో చిత్రీక‌రించి (Cinema Shooting), సినిమాలో బెంగ‌ళూరు అని చూపించార‌ని, అది చూసిన‌ప్పుడు నాకు చాలా ఒళ్లు మండింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఖాజాగూడ లేక్ వ‌ద్ద చెరువుల అభివృద్ధిపై నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

దుర్గం చెరువును ప్ర‌తి ఒక్క‌రూ చూసే ఉంటారని కేటీఆర్ పేర్కొన్నారు. అక్క‌డ కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) నిర్మించి, ఆ చెరువును అభివృద్ధి చేసిన త‌ర్వాత‌.. ప‌ర్యాట‌కుల తాకిడి ఎక్కువైంద‌న్నారు. అంతేకాకుండా ఇటీవ‌ల కాలంలో ఆ కేబుల్ బ్రిడ్జి లేని సినిమా లేనే లేదు. ఇంకా హైలెట్ ఏంటంటే.. ఖాజాగూడ్ లేక్ (Khajaguda Lake) ప‌క్క‌నే డెవ‌ల‌ప్ చేసిన లింక్ రోడ్డుపై కూడా సినిమా షూటింగ్‌లు చేసిన విష‌యాన్ని కేటీఆర్ ప్ర‌స్తావిస్తూ.. కొవిడ్ టైమ్‌లో కూడా ఎక్కువ సినిమాలు చూశాను.

ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఓ మ‌ళ‌యాలం సినిమా (Malayalam Movie) చూసిన‌ట్లు తెలిపారు. అయితే ఆ సినిమాలో పృథ్వీరాజ్ లీడ్ క్యారెక్ట‌ర్ అని పేర్కొన్నారు. స‌రిగ్గా ఈ రోడ్డు మీదనే షూటింగ్ చేసి ఆ సినిమాలో ఏం చూపిస్తున్నారో తెలుసా..? అది బెంగ‌ళూరు అని చూపెడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అప్పుడు త‌న‌కు చాలా ఒళ్లు మండిందని కేటీఆర్ అన్నారు.

హైద‌రాబాద్‌లో షూటింగ్ చేసి.. బెంగ‌ళూరు (Bengaluru) అని చెప్పుకుంటున్నారు ఏంద‌ని..? కోపం వ‌చ్చింది. తానే ఏదో ఒక‌టి అందామ‌నుకున్నాను. ఈ లోపే హైద‌రాబాద్‌కు చెందిన‌ ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టు ఆ మూవీపై ట్వీట్ చేసింది. ఇదేం దారుణం.. మా హైద‌రాబాద్‌లో షూటింగ్ చేసి.. బెంగ‌ళూరు అని చెప్ప‌డం ఇదేక్క‌డి అన్యాయం అని ప్ర‌శ్నించింది. అప్పుడు త‌న‌కు సంతోషం అనిపించింది. ఇది మ‌న హైద‌రాబాద్ న‌గ‌రం అని ప్ర‌తి హైద‌రాబాదీలో క‌న‌బ‌డుతుంటే సంతోషం అనిపిస్తుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు