విధాత: మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు. ఆయన ఏం చేసినా భిన్నంగా ఉంటుంది. మాట్లాడినా.. డ్యాన్సు చేసినా, విపక్ష నేతలపై పంచులు విసిరినా తనదైన ప్రత్యేకతను చూపెడుతారు. అలాగే తన కాలేజీల్లో చదివే పిల్లలను ఉత్తేజపరచడానికి ఆయన కుర్రాడుగా మారిపోతుంటారు. అందుకే మంత్రి మల్లారెడ్డి అంటే మజాకా అన్నట్టు ఉంటుంది ఆయన వ్యవహారశైలి. ఇదే తరహాలో మరోసారి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మరోసారి సందడి చేశారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో మల్లారెడ్డి […]
విధాత: మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు. ఆయన ఏం చేసినా భిన్నంగా ఉంటుంది. మాట్లాడినా.. డ్యాన్సు చేసినా, విపక్ష నేతలపై పంచులు విసిరినా తనదైన ప్రత్యేకతను చూపెడుతారు. అలాగే తన కాలేజీల్లో చదివే పిల్లలను ఉత్తేజపరచడానికి ఆయన కుర్రాడుగా మారిపోతుంటారు. అందుకే మంత్రి మల్లారెడ్డి అంటే మజాకా అన్నట్టు ఉంటుంది ఆయన వ్యవహారశైలి.
ఇదే తరహాలో మరోసారి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మరోసారి సందడి చేశారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో మల్లారెడ్డి సందడి చేసి నెట్టింట వైరల్ అవుతున్నారు. డీజే టిల్లు హీరో సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి మల్లారెడ్డి స్టెప్పులేశారు. సిద్ధూ జొన్నలగడ్డ స్టెప్పులకు అనుగుణంగా మల్లారెడ్డి స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అక్కడున్న యూత్‌లో జోష్ నింపారు.
సంక్రాంతి సంబురాల్లో భాగంగా విద్యార్థులకు కైట్ ఫెస్టివల్, రంగోళి పోటీలు నిర్వహించారు. అదే క్రమంలో వాల్తేరు వీరయ్య సినిమాలోని ఐదో పాటను ఇదే యూనివర్సిటీలో చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధూ జొన్నలగడ్డ, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్, డైరెక్టర్ బాబీ, డ్యాన్స్‌మాస్టర్ శేఖర్ మాస్టర్ హాజరై, విద్యార్థుల్లో సంక్రాంతి జోష్‌ను నింపారు. డీజే టిల్లు పాటలతో మల్లారెడ్డి క్యాంపస్ మార్మోగిపోయింది.
జనాలను చూడగానే మంత్రి మల్లారెడ్డికి ఎనలేని ఉత్సాహం వచ్చింది. దేవీశ్రీ, శేఖర్ మాస్టర్ డ్యాన్స్ చూశాక తానేం తక్కువ అన్నట్టు మంత్రి డీజే టిల్లు సినిమాలోని పాటకు స్టెప్పులేశారు. ఆ యూత్‌ను ఉర్రూతలూగించిన డీజే టిల్లులోని ఆ పాటకు ఆ సినిమా హీరో జొన్నలగడ్డ సిద్దుతో కలిసి మంత్రి డ్యాన్సు చేసి అందరినీ అలరించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
అలాగే వర్సిటీలో విద్యార్థులు వేసిన ముగ్గులకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డును అందుకున్నట్టు మంత్రి మల్లా రెడ్డి ప్రకటించారు. మల్లారెడ్డి ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా సందర్భాల్లో డ్యాన్స్ చేశారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ల్లారెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి ఉప్పల్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన మల్లారెడ్డి పార్టీ పాటలకు తగ్గట్టుగా తీన్మార్ స్టెప్పులేశారు.