Minister Ponnam Prabhakar | జ్యోతిబాపూలేను దేవుడిగా పూజించాలి

Minister Ponnam Prabhakar | జ్యోతిబాపూలేను దేవుడిగా పూజించాలి
  • బ‌ల‌హీన వ‌ర్గాల కార్పోరేష‌న్ల‌కు ఆర్థిక స‌హ‌కారం
  • జ‌యంతి ఉత్స‌వాల‌లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

 

విధాత‌: బడుగు బలహీనర్గాలు జ్యోతాబాపూలేను దేవుడిగా పూజించాలని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. గురువారం హైదరాబాద్ లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు నిర్వ‌హించారు. ఈ ఉత్స‌వాల‌కు ముఖ్యతిధిగా హాజ‌రైన మంత్రి పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో లో భాగంగా దేశ వ్యాప్తంగా కుల గణన చేస్తామని హామి ఇచ్చామ‌న్నారు.

బలహీన వర్గాల కార్పొరేషన్లకు ఆర్థిక సహకారం అందిస్తాం తెలిపారు. మారుతున్న కాలంతో పాటు కులవృత్తులు మారుతున్నాయన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున‌ అధికారికంగా ఏది కూడా ప్రకటించడానికి లేదన్నారు. బీసీ లకు న్యాయం చేయాలని నాతో పాటు నా పార్టీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ ల అభివృద్ధి కి కట్టుబడి ఉందని స్ప‌ష్టం చేశారు.