International Women’s Day | హనుమకొండలో రాష్ట్రస్థాయి మహిళా దినోత్సవ వేడుకలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మార్చి 8 అంతర్జాతీయ మహిళ దినోత్సవం (International Women's Day) సందర్భంగా ఏటా హైదరాబాద్(Hyderabad)లో జరిగే రాష్ట్ర స్థాయి వేడుకలు ఈ సారి హనుమకొండ (Hanumakonda)లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్బంగా వేడుకలపై మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathore) హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల […]

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మార్చి 8 అంతర్జాతీయ మహిళ దినోత్సవం (International Women’s Day) సందర్భంగా ఏటా హైదరాబాద్(Hyderabad)లో జరిగే రాష్ట్ర స్థాయి వేడుకలు ఈ సారి హనుమకొండ (Hanumakonda)లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్బంగా వేడుకలపై మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathore) హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. అనేక రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న మహిళలకు కమిటీ సూచించిన దాని ప్రకారం పారదర్శకంగా అవార్డులతో పాటు లక్ష రూపాయల నగదు,శాలువా, మెమెంటో లతో సత్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. పక్కా ప్రణాళికతో కార్యక్రమం జరగాలని చెప్పారు. ఈ ఉత్సవాలకు
హైదరాబాద్ తర్వాత తొలిసారి వరంగల్(Warangal) లోని ఈ ఉత్సవాలు నిర్వహించడం విశేషం. సీఎం కేసీఆర్ (CM KCR) వరంగల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సంబంధిత శాఖ మంత్రి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం కారణంగా భావిస్తున్నారు. మహిళ దినోత్సవ కార్యక్రమాన్ని కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) ఆడిటోరియంలో నిర్వహించానున్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
ఓరుగల్లు చరిత్ర తెలిసే విధంగా
వరంగల్ చరిత్ర తెలిసే విధంగా శాలువా, మెమెంటోలు ఉండాలని మంత్రి సూచించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి కావలిసిన మొక్కలను అందుబాటులో ఉంచండి. మహిళ దినోత్సవం నాడు మహిళ క్లినిక్ ప్రారంభిస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతిహొలీ కెరీ, సంగీత నాటక చైర్పర్సన్ దీపికా రెడ్డి వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సిక్త పట్నాయక్, గోపి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ ప్రావీణ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బిల్లులు పెండింగ్ పెట్టడం దురదృష్టకరం
చట్టసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించ కుండా పెండింగ్‌లో పెట్టడం దురదృష్టకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గవర్నర్ కూడా ట్విట్టర్ వేదికగా ప్రతిస్పందించారు.
ఈ విషయాలపై మంత్రి సత్యవతి పై విధంగా స్పందించారు. హనుమకొండలో శనివారం ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు. గవర్నర్ వ్యవస్థను గౌరవిస్తాంగానీ ఇలా అయితే మిమ్మల్ని ఎందుకు గౌరవించాలంటూ ప్రశ్నించారు. చట్టసభల నిర్ణయాల పై గౌరవం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసిన బిల్లుల పట్ల చిన్నచూపు ఎంతవరకు న్యాయమైందన్నారు.
ప్రీతి సంఘటనపై నిష్పక్షపాత విచారణ
కేఎంసి మెడికో డాక్టర్ ప్రీతి మృతి సంఘటన బాధాకరమని అన్నారు ఆమె మృతి పై విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రీతి తల్లిదండ్రులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదన్నారు. విచారణ పై నమ్మకం లేకుంటే వారు ఎవరితో విచారణ కోరుకుంటే వారితో జరిపిస్తామని చెప్పారు.