ఇసుక లారీలను నియంత్రించండి: మంత్రి సీతక్క

ములుగు జిల్లాలో ఇసుక లారీలను నియంత్రించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

  • By: Somu    latest    Jan 08, 2024 12:47 PM IST
ఇసుక లారీలను నియంత్రించండి: మంత్రి సీతక్క

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లాలో ఇసుక లారీలను నియంత్రించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అధిక లోడు వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మేడారం జాతర దృష్ట్యా ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సోమవారం ఆమె పేర్కొన్నారు.


భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంద‌ని, ఓవర్ లోడ్ తో వచ్చే లారీలను అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. మేడారం జాతర పనుల విషయములో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అధికారులు ఇంటికి పోతారని, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడుతామని మంత్రి హెచ్చరించారు.