హరీశ్‌రావువి అన్నీ అబద్దాలే: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ఏర్పడ్డాకే కృష్ణ నీటిలో తెలంగాణకి ఎక్కువ అన్యాయం జరిగిందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు

విధాత: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ఏర్పడ్డాకే కృష్ణ నీటిలో తెలంగాణకి ఎక్కువ అన్యాయం జరిగిందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం(05-02-2024) సచివాలయం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చాలా అబద్దాలు మాట్లాడారన్నారు. వీళ్ళ పరిపాలన అసమర్థత వల్లనే కృష్ణ జల్లాలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. బీఆరెస్ సర్కారు ప్రవేశ పెట్టిన గత బడ్జెట్‌లో పత్రాల్లో
కె ఆర్ ఎం బి కి ప్రాజెక్టులు అప్పగించడానికి ఒప్పుకొని మెయింటెనెన్స్ కింద 200 కోట్లు కేటాయిస్తున్నట్టుగా పొందు పరిచారన్నారు. కే ఆర్ ఎంబీకి ప్రాజెక్ట్ లు ఇవ్వడానికి ఈ 56 రోజుల పాలన లో మేము ఎక్కడ ఒప్పుకోలేదన్నారు. 2020 మే 5వ తేదీన రోజుకు 8 టీఎంసీల నీటిని తీసుకు పోవడానికి ఏపీ ప్రభుత్వం జీవో 203 ఇచ్చిందని, దీనికి అభ్యంతరం చెప్పడం ఇష్టం లేక అపెక్స్ కౌన్సిల్‌కు పిలిస్తే తెలంగాణ, ఏపీ సీఎంలు వెళ్లలేదన్నారు. ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టుకోటానికి అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టడానికే ఆ మీటింగ్ కి వెళ్ళలేదని ఉత్తమ్ ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఒక్క ప్రాజెక్ట్ కూడా 10ఏళ్ళ లో పూర్తి చేయలేదన్నారు.
తెలంగాణలో నీటి కేటాయింపుల్లో మోసం జరిగిందని, కే ఆర్ ఎంబీకికి ప్రాజెక్ట్ లు ఇచ్చిందే బీఆర్ఎస్ వాళ్లని అన్నారు. గ్రావిటీ ద్వారా రావలసిన ఎనిమిది టిఎంసిల కృష్ణా జలాలను కేసీఆర్, జగన్ లు ఏకాంతం గా మాట్లాడుకుని ఏపీ కి అప్పగించారన్నారు.
కేఆర్ ఎంబీకి ప్రాజెక్ట్‌లు ఇవ్వడానికి తాము ఎట్టి పరిస్థిలో ఒప్పుకోమని ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం లో షకావత్ ని కలిసి ఖరాఖండి గా చెప్పామన్నారు. తెలంగాణ వచ్చింది వీళ్ళ వల్ల కాదదన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి చిదంబరం కేంద్రంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒప్పించడం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్ తెలంగాణలో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఓటింగ్ డే నాడు జగన్ తో మాట్లాడి సీఆర్పీఎఫ్ ని నాగార్జున సాగర్ డాం మీదకు పంపి కుట్ర చేసాడన్నారు. ఇది రాజకీయంగా కుట్ర చేయడానికి కేసీఆర్ ఆడిన నాటకమన్నారు.