పెద్దగట్టులో మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్ పూజలు

విధాత: సూర్యాపేట పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి డిఎంఎస్ చైర్మన్ వట్టిపల్లి జానయ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పెద్దగట్టు జాతరలో పాల్గొని పూజలు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ పరిపాలనలో అన్ని విధాల […]

పెద్దగట్టులో మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్ పూజలు

విధాత: సూర్యాపేట పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి డిఎంఎస్ చైర్మన్ వట్టిపల్లి జానయ్య స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పెద్దగట్టు జాతరలో పాల్గొని పూజలు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ పరిపాలనలో అన్ని విధాల సంక్షేమం, అభివృద్ధితో ముందుకు సాగాలని కోరుకున్నట్లు తెలిపారు.

తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ప్రభుత్వం పండుగలు, జాతరలకు పెద్దపీట వేస్తూ ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందన్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తుందన్నారు.

కాగా సోమవారం పెద్దగట్టు జాతరకు భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో గట్టు పరిసరాలన్నీ భక్త జన సంద్రంగా మారాయి. లింగో ఓ లింగో అంటూ భక్తులు గంపలు, బోనాలతో, మేకపోతులతో డోలు వాయిద్యాలతో లింగమతుల దర్శనానికి తరలివచ్చారు.