నోయిడాలో హైవేపై వేగంగా వెళ్తున్న వాహ‌నాల నుంచి డ‌బ్బులు వెద‌జ‌ల్లిన ఆక‌తాయిలు

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇటీవ‌ల అతివేగంగా వెళ్తున్న ఎస్‌యూవీల పైకప్పుపై నుంచి కొంద‌రు ఆక‌తాయిలు డ‌బ్బులు వెద‌జ‌ల్లుతూ వెళ్లారు.

  • By: Somu    latest    Nov 28, 2023 10:49 AM IST
నోయిడాలో హైవేపై వేగంగా వెళ్తున్న వాహ‌నాల నుంచి డ‌బ్బులు వెద‌జ‌ల్లిన ఆక‌తాయిలు
  • ఒక్కో వాహ‌నానికి రూ. 33 వేల చొప్ప‌న జ‌రిమానా
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఘ‌ట‌న‌


విధాత‌: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇటీవ‌ల అతివేగంగా వెళ్తున్న ఎస్‌యూవీల పైకప్పుపై నుంచి కొంద‌రు ఆక‌తాయిలు డ‌బ్బులు వెద‌జ‌ల్లుతూ వెళ్లారు. డబ్బులు విసురుతున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌గా మారింది. హైవేపై వేగంగా వెళ్లే కార్ల కిటికీలకు వేలాడుతూ, పైకప్పుల నుంచి బయట నిలబడి కొందరు వ్యక్తులు రాత్రిపూట నోట్లు విసురుతున్నట్టు వీడియోలో క‌నిపించింది.

ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిన పోలీసులు వాహ‌నాల‌తోపాటు నిందితుల‌ను కూడా గుర్తించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదు వాహనాలకు రూ.33 వేల చొప్పున జరిమానా విధించారు.