BRS | ఎమ్మెల్యే ఫోన్ చేసి ఒంటరిగా రమ్మంటున్నడు.. కోరిక తీర్చాలని వేధిస్తున్నారు: మహిళా సర్పంచ్

గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపుల్లో వివక్ష ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు.. ధర్మసాగర్, వేలేరు మండలాల్లో అగ్రవర్ణాల నాయకులదే పెత్తనం మహిళా దినోత్సవం మరుసటి రోజే కన్నీరు పెట్టిన దళిత మహిళా సర్పంచ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తనను తమ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత (ఎమ్మెల్యే) లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని దళిత మహిళా సర్పంచ్ కన్నీరు పెట్టుకుంది. మహిళా దినోత్సవం మరుసటి రోజున్నే ఈ సంఘటన జరిగింది. హన్మకొండ జిల్లా […]

BRS | ఎమ్మెల్యే ఫోన్ చేసి ఒంటరిగా రమ్మంటున్నడు.. కోరిక తీర్చాలని వేధిస్తున్నారు: మహిళా సర్పంచ్
  • గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపుల్లో వివక్ష
  • ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు..
  • ధర్మసాగర్, వేలేరు మండలాల్లో అగ్రవర్ణాల నాయకులదే పెత్తనం
  • మహిళా దినోత్సవం మరుసటి రోజే కన్నీరు పెట్టిన దళిత మహిళా సర్పంచ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తనను తమ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత (ఎమ్మెల్యే) లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని దళిత మహిళా సర్పంచ్ కన్నీరు పెట్టుకుంది. మహిళా దినోత్సవం మరుసటి రోజున్నే ఈ సంఘటన జరిగింది.

హన్మకొండ జిల్లా స్టేషన్గన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలంలోని బీఆర్ఎస్‌(BRS)కు చెందిన జానకిపురం గ్రామ సర్పంచ్ కురల్లీ నవ్య (Navya) తనపై ఓ నేత లైంగిక వేధింపులు, మానసికంగా వేదిస్తున్నాడు అంటూ విలేకరుల సమావేశంలో తన గోడును వెళ్ళబోసుకుంది.

నిధుల్లో వివక్ష చూపెడుతున్నారు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధర్మసాగర్ మండలానికి చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులు, ముఖ్యం నాయకుల ఓ నాయకుడి కోరిక తీర్చమంటు మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. వారి మాట కాదనటంతో గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు అక్కా చెల్లెల్లు లేరా… అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేము ఆస్తులు, బంగారం, పొలాలు అమ్ముకొని రాజకీయం చేస్తున్నామని అన్నారు. నేతల కోరికలు తీర్చేందుకు రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు పచ్చామని తెలిపారు. వేలేరు మండలాల్లో అగ్రవర్ణాల నాయకులదే పెత్తనం అని ఆరోపించారు.

నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలు ఉండటం వలన అభివృద్ధి కుంటుపడిందని గత నెలలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటించినప్పుడు ఓ మహిళా ప్రజాప్రతినిధి తనను తీవ్రంగా అవమానించార న్నారు. ఇప్పటికైనా సదరు నేత మహిళలతో మంచిగా వ్యవహరించాలని హితవు పలికారు. దానికి అవకాశం లభిస్తే కేసీఆర్ కేటీఆర్ ను కలిసి తన బాధ వివరిస్తానని సర్పంచ్ నవ్య చెప్పారు.

గతంలోనూ ఇలాంటి సంఘటనలు

ఇదిలా ఉండగా సదరు నేత మహిళలను ఇలాంటి చిలిపి చేష్టలతో వేధించిన సంఘటనలు గతంలో కూడా జరిగాయి. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయి పరువు బజారున పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినా అతనిలో ఏ మార్పు లేదని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

మధ్యవర్తి మహిళల ద్వారా రకాల ప్రలోభాలు చూపెట్టి తనకు నచ్చిన మహిళలను లోబరుచుకోవడం ఆయనకు అలవాటని నియోజకవర్గంలో పెద్ద టాక్ ఉంది. మరి ఈసారి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోననే చర్చ సాగుతోంది.