సుప్రీంలో కవిత పిటిషన్ విచారణ మరోసారి వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం జరుగాల్సిన కవిత పిటిషన్ విచారణను మార్చి 19కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మహిళగా తనను ఈడీ విచారించే క్రమాన్ని ఆమె ఈ పిటిషన్‌లో సవాల్ చేసింది.
అనంతరం కవిత మరోసారి ఈడీ, సీబీఐల నుంచి విచారణకు హాజరుకావాలని నోటీస్‌లు అందించినప్పటికి ఆమె సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణ తేలేవరకు విచారణకు హాజరుకాబోనని సమాధానమిచ్చింది. అలాగే పార్లమెంటు ఎన్నికల ప్రచార బాధ్యతల్లో ఉన్నానంటూ నోటీస్‌లకు సమాధానిలిచ్చి విచారణకు హాజరుకాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనుమానితురాలిగా ఉన్నకవిత పేరును నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ సీఎర్పీ 41కింద విచారణకు హాజరుకావాలని ఆమెకు నోటీసులు జారీ చేసింది.