పూలే విగ్రహ సాధనకు ఉద్యమం ఉధృతం.. యాదాద్రిలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి కొండాలను అవమానించారు

అసెంబ్లీలో పూలే విగ్రహ సాధన డిమాండ్ సాధనకు చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు

పూలే విగ్రహ సాధనకు ఉద్యమం ఉధృతం.. యాదాద్రిలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి కొండాలను అవమానించారు

భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత

విధాత: అసెంబ్లీలో పూలే విగ్రహ సాధన డిమాండ్ సాధనకు చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నల్గొండలో జాగృతి యునైటెడ్ పోలియో ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ హక్కుల సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ లో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్ కు వినతిపత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడుకి వినతిపత్రం ఇచ్చారని రేవంత్ అవమానించారని ఆరోపించారు. అప్పుడు ఓపిక పట్టినమని…ఇవ్వాళ సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దళితుడి అయిన డిప్యూటీ సీఎం భట్టిని, బిసి మంత్రి కొండా సురేఖను రేవంత్ అవమానించారని… సీఎం భట్టికి , కొండ సురేఖకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇవ్వాళ మహిళకు 47 శాతం రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చాం అని సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారని, గురుకులాల్లో 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ జీవో ఇచ్చారని… దాన్ని కాంగ్రెస్ వాళ్లు తీసేసారని విమర్శించారు…సీఎం చెప్పేవన్ని అబద్ధాలేనని..యువతను మభ్యపెట్టాలని సీఎం చూస్తున్నారన్నారు

విద్యార్థులను మోసం చేయవద్దని.. బీసీలకు మ్యానిఫెస్టో లో చెప్పిన విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు .అందుకే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో యూపీఏ ఆధ్వర్యంలో చేపట్టిన కుల గణనను తొక్కి పెట్టారని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.

కులగణన విషయంలో కాలయాపన చేయొద్దనీ, అసెంబ్లీ తీర్మానంతో సరిపెట్టకుండా చట్టబద్ధత కల్పించి కుల గణన నిర్ణీత గడువుగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కులగణన లెక్కలతో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు….ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలకంటే ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. తాము జైమ్ భీం ,జై బీసీ, జై పూలే నినాదంతో ముందుకు పోతామన్నారు.