Noida | ఫ్యాష‌న్ షోలో అప‌శృతి.. లైట్ల దూలం కూలి మోడ‌ల్ దుర్మ‌ర‌ణం

మ‌రొక‌రికి తీవ్ర గాయాలు.. నోయిడాలో ఘ‌ట‌న‌ విధాత‌: ఫ్యాష‌న్ షోలో అపశృతి చోటుచేసుకున్న‌ది. లైట్లు బిగించిన దూలం (లైటింగ్ ట్ర‌స్‌) ఓ మోడ‌ల్‌పై కూల‌డంతో ఆమె దుర్మ‌ర‌ణం చెందింది. ఉత్త‌రప్ర‌దేశ్ నోయిడా (Noida) న‌గ‌రంలో ఫిల్మ్‌సిటీ ఆదివారం రాత్రి నిర్వ‌హించిన ఫ్యాష‌న్ షోలో ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆదివారం అర్ధ‌రాత్రి ఫ్యాష‌న్ మొద‌లైంది. మోడ‌ళ్లు ర్యాంప్‌పై క్యాట్ వాట్ చేస్తున్నారు. 1.30 గంట‌ల ప్రాంతంలో లైటింగ్ ట్ర‌స్ ఒక్క‌సారిగా కూలి […]

Noida | ఫ్యాష‌న్ షోలో అప‌శృతి.. లైట్ల దూలం కూలి మోడ‌ల్ దుర్మ‌ర‌ణం
  • మ‌రొక‌రికి తీవ్ర గాయాలు.. నోయిడాలో ఘ‌ట‌న‌

విధాత‌: ఫ్యాష‌న్ షోలో అపశృతి చోటుచేసుకున్న‌ది. లైట్లు బిగించిన దూలం (లైటింగ్ ట్ర‌స్‌) ఓ మోడ‌ల్‌పై కూల‌డంతో ఆమె దుర్మ‌ర‌ణం చెందింది. ఉత్త‌రప్ర‌దేశ్ నోయిడా (Noida) న‌గ‌రంలో ఫిల్మ్‌సిటీ ఆదివారం రాత్రి నిర్వ‌హించిన ఫ్యాష‌న్ షోలో ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఆదివారం అర్ధ‌రాత్రి ఫ్యాష‌న్ మొద‌లైంది. మోడ‌ళ్లు ర్యాంప్‌పై క్యాట్ వాట్ చేస్తున్నారు. 1.30 గంట‌ల ప్రాంతంలో లైటింగ్ ట్ర‌స్ ఒక్క‌సారిగా కూలి ఓ మోడ‌ల్‌పై ప‌డ‌టంతో ఆమె దుర్మ‌ర‌ణం చెందారు.

మృతురాలిని గ్రేట‌ర్ నోయిడాలోని గౌర్‌సిటీ-2కు చెందిన వంశిక చోప్రా (24)గా గుర్తించారు. ఆగ్రాకు చెందిన మ‌రో మోడ‌ల్ బ‌బ్బి రాయ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆమెను హుటాహుటిన‌ స‌మీపంలోని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.

ప్రస్తుతం ఆమెకు చికిత్స జ‌రుగుతున్న‌ది. ఆమె ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన నలుగురు అనుమానితులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్టు నోయిడా ఏడీసీపీ శక్తి అవస్తీ తెలిపారు. ఫ్యాషన్ షో నిర్వాహకుల‌తోపాటు, లైటింగ్ ట్రస్ అమర్చిన వ్య‌క్తుల‌ను సైతం అదుపులోకి తీసుకొని ప్ర‌శ్నిస్తున్నారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.