తెలుగు రాష్ట్రాల్లో మోడీ టూర్‌.. బంద్‌కు పిలుపునిచ్చిన క‌మ్యూనిస్టులు

విధాత‌: ప‌్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ శ‌నివారం తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాలలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాగా బెంగుళూరు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మోడీ ప్ర‌త్యేక విమానంలో శుక్ర‌వారం రాత్రి విశాఖ‌కు చేరుకోనున్నారు. త‌న‌తో భేటీ కావాల‌ని ప్ర‌ధాని మోడీ ఇప్ప‌టికే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు స‌మాచారం అందించారు. శ‌నివారం ఉద‌యం విశాఖ న‌గ‌రంలో ప‌లు ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిలు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు […]

  • By: krs    latest    Nov 11, 2022 3:45 PM IST
తెలుగు రాష్ట్రాల్లో మోడీ టూర్‌.. బంద్‌కు పిలుపునిచ్చిన క‌మ్యూనిస్టులు

విధాత‌: ప‌్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ శ‌నివారం తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాలలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాగా బెంగుళూరు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మోడీ ప్ర‌త్యేక విమానంలో శుక్ర‌వారం రాత్రి విశాఖ‌కు చేరుకోనున్నారు. త‌న‌తో భేటీ కావాల‌ని ప్ర‌ధాని మోడీ ఇప్ప‌టికే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు స‌మాచారం అందించారు.

శ‌నివారం ఉద‌యం విశాఖ న‌గ‌రంలో ప‌లు ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిలు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. రూ. 460 కోట్ల‌తో అభివ‌’ద్ది చేయ‌నున్న విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేష‌న్‌కు మోడీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఆ త‌రువాత ప్ర‌ధాని మోడీ ప్ర‌త్యేక విమానంలో విశాఖ నుంచి బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకోనున్నారు. 1.40 గంట‌లకు విమానాశ్ర‌యం ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగించ‌నున్నారు.