ట్వీటుకో రేటు.. పోష్టుకో నోటు: ట్విట్టర్ CEO మస్క్ నిర్ణయం
వినియోగదారులకు ఫీజు విధాత: ఇన్నాళ్లూ ఫ్రీగా వాడుకున్న ట్విట్టర్ ఇకముందు కాస్ట్లీ కాబోతోంది.. వేలకోట్లు పెట్టి కొనుగోలు చేసింది జనానికి ఫ్రీగా ఇవ్వడానికా.?? ఫీజులు పెట్టండి.. డబ్బులు కడితేనే ట్వీట్లు.. పేమెంట్ పడితేనే పోష్టులు అంటూ ట్విట్టర్ కొత్త ఓనర్ ఎలాన్ మస్క్ హుకుం జారీ చేశారు. ప్రస్తుతం ఫెసుబుక్.. ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్ ..గూగుల్ వంటి సోషల్ మీడియా వేదికలు ఉచితంగా వాడుకుంటూ వస్తున్నాం. అయితే ఇకముందు ట్విట్టర్ సర్వీస్ ఉచితం కాబోదు.. ఎంతోకొంత ఫీజు నిర్ణయించి […]

- వినియోగదారులకు ఫీజు
విధాత: ఇన్నాళ్లూ ఫ్రీగా వాడుకున్న ట్విట్టర్ ఇకముందు కాస్ట్లీ కాబోతోంది.. వేలకోట్లు పెట్టి కొనుగోలు చేసింది జనానికి ఫ్రీగా ఇవ్వడానికా.?? ఫీజులు పెట్టండి.. డబ్బులు కడితేనే ట్వీట్లు.. పేమెంట్ పడితేనే పోష్టులు అంటూ ట్విట్టర్ కొత్త ఓనర్ ఎలాన్ మస్క్ హుకుం జారీ చేశారు.
ప్రస్తుతం ఫెసుబుక్.. ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్ ..గూగుల్ వంటి సోషల్ మీడియా వేదికలు ఉచితంగా వాడుకుంటూ వస్తున్నాం. అయితే ఇకముందు ట్విట్టర్ సర్వీస్ ఉచితం కాబోదు.. ఎంతోకొంత ఫీజు నిర్ణయించి వసూలు చేయాలని కొత్త బాస్ నిర్ణయించారట.
కేవలం ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని భావించిన మస్క్ వినియోగదారుల నుంచి కూడా కొంత ఫీజు వసూలు చేస్తారట. ఈ మేరకు ట్విటర్ వినియోగదారుల నుంచి రాబోయే రోజుల్లోనే నెలకు $20 డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించారు. ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్న ఎలన్ మస్క్ ఈ మేరకు వినియోగదారులకు షాక్ లు ఇవ్వడానికి రెడీ అయిపోయారు.
ఈ మేరకు ఉద్యోగులకు ఎలోన్ మస్క్ మొదటి టాస్క్ ఇచ్చినట్టు సమాచారం. ప్లాట్ఫారమ్లో చెల్లింపు ధృవీకరణను ప్రారంభించడానికి అతని గడువు విధించాడు. రాబోయే కొన్ని నెలల్లోనే ట్విట్టర్‌లో చెల్లింపు సేవలు మొదలుకానున్నాయి.
బ్లూటిక్ ఉన్న సినీ రాజకీయ పారిశ్రామక ప్రముఖులు సంస్థలు ఇక ట్విట్టర్ లో ఆ సెలబ్రెటీ హోదా దక్కాలంటే డబ్బులను ట్విట్టర్ కు చెల్లించాల్సిందే.. ట్విట్టర్‌లో బ్లూ టిక్ ఉన్న ప్రముఖులు అదనపు ఫీచర్లను కలిగి ఉన్న వారు సంస్థ నుంచి నెలకు $4.99 ఐచ్ఛిక సభ్యత్వం తీసుకోవాలని.. ఆ వినియోగ దారులకు మాత్రమే గుర్తింపు పొందిన ఖరీదైన సబ్స్క్రిప్షన్గా మారుతుందని రూల్ పెట్టారు.
ట్విట్టర్ లో రాజకీయ, పారిశ్రామిక, క్రీడా సినీ ప్రముఖుల అధికారిక ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్ మార్క్ ఉంటుంది. ఇక కంపెనీలు సంస్థలు సినీ నిర్మాణ సంస్థలకు ఇలా ఉంటుంది. అలా ఉండాలంటే రాబోయే రోజుల్లో నెలకు కొంత మొత్తం చెల్లించాలన్న మాట. దీన్నే ఎలన్ మస్క్ అమలు చేయడానికి డిసైడ్ అయ్యాడు.
ఇదివరకు ఉన్న 280 అక్షరాల పరిమితిని పెంచేందుకు.. కాస్త వివరంగా ఉండే పోష్టులు సైతం పెట్టవచ్చని, వీడియోలు సైతం కాస్త ఎక్కువ నిడివి ఉన్నవి పోస్ట్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. మున్ముందు ప్రతి వినియోగదారుడూ ఎంతోకొంత ఫీజ్ చెల్లించాలని నిబంధన పెట్టవచ్చని అంటున్నారు.