ముంగీస చేతిలో మట్టి కరిచిన నల్ల త్రాచు.. వీడియో వైరల్

విధాత: పాములు అనగానే హడలిపోతాం.. భయపడిపోతాం.. వణుకు పుడుతుంది. విషపూరిత సర్పాలు కాటేస్తే విలవిలలాడిపోతాం. కానీ అవే విషపూరిత పాములకు ముంగీస ముచ్చెమటలు పట్టిస్తుంది. పాము కంట పడిందంటే చాలు.. దాన్ని అంతమొందించే వరకు పట్టువీడదు. ఐతే ముంగీసకు ఓ నల్లనాగుకు మధ్య జరిగిన ఫైటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముంగీసకు ప్రధాన శత్రువైన ఓ నల్ల నాగుపాము దాని కంట పడింది. ఇక ముంగీస పాముపై విరుచుకు పడింది. పాము బుసలు […]

  • By: krs    latest    Jan 01, 2023 12:32 AM IST
ముంగీస చేతిలో మట్టి కరిచిన నల్ల త్రాచు.. వీడియో వైరల్

విధాత: పాములు అనగానే హడలిపోతాం.. భయపడిపోతాం.. వణుకు పుడుతుంది. విషపూరిత సర్పాలు కాటేస్తే విలవిలలాడిపోతాం. కానీ అవే విషపూరిత పాములకు ముంగీస ముచ్చెమటలు పట్టిస్తుంది. పాము కంట పడిందంటే చాలు.. దాన్ని అంతమొందించే వరకు పట్టువీడదు. ఐతే ముంగీసకు ఓ నల్లనాగుకు మధ్య జరిగిన ఫైటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ముంగీసకు ప్రధాన శత్రువైన ఓ నల్ల నాగుపాము దాని కంట పడింది. ఇక ముంగీస పాముపై విరుచుకు పడింది. పాము బుసలు కొడుతూ పడగ విప్పి ముంగీస పై దాడి చేసింది. ముంగీస కూడా అదే స్థాయిలో పాముపై పోరాటం చేసింది. తన నోటితో పామును అదిమిపట్టింది. చివరకు ముంగీస దాడిలో పాము చనిపొయింది. ఈ video ను 27 మిలియన్ల మంది వీక్షించారు. లక్షల మంది లైక్ చేశారు.