స్నేహామంటే ఇదేరా.. కోతి చేసిన సాయానికి నెటిజ‌న్లు ఫిదా

Monkey Friendship | ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు ఆదుకునే వాడు.. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న‌ప్పుడు క‌డుపు నింపేవాడే నిజ‌మైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడు క‌డ‌దాకా.. క‌ష్ట‌న‌ష్టాల్లో పాలు పంచుకుంటాడు. కానీ కొంత మంది మాత్రం స్వార్థంగా జీవిస్తున్నారు. నేను బాగుంటే చాలు.. ప‌క్కోడి గురించి నాకెందుకు అనుకునే మ‌న‌షులు ఈ భూమ్మీద కోకోల్లలుగా ఉన్నారు. అలాంటి స్వార్థ‌ప‌రులు ఈ జంతువుల స్నేహాన్ని చూసైనా కొంత నేర్చుకుంటే బాగుంటుంది. ఓ ఫారెస్ట్‌లో జింక‌లు గ‌డ్డి కోసం వెతుకుతున్నాయి. ఓ చెట్టు నిల్చున్న […]

స్నేహామంటే ఇదేరా.. కోతి చేసిన సాయానికి నెటిజ‌న్లు ఫిదా

Monkey Friendship | ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు ఆదుకునే వాడు.. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న‌ప్పుడు క‌డుపు నింపేవాడే నిజ‌మైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడు క‌డ‌దాకా.. క‌ష్ట‌న‌ష్టాల్లో పాలు పంచుకుంటాడు. కానీ కొంత మంది మాత్రం స్వార్థంగా జీవిస్తున్నారు.

నేను బాగుంటే చాలు.. ప‌క్కోడి గురించి నాకెందుకు అనుకునే మ‌న‌షులు ఈ భూమ్మీద కోకోల్లలుగా ఉన్నారు. అలాంటి స్వార్థ‌ప‌రులు ఈ జంతువుల స్నేహాన్ని చూసైనా కొంత నేర్చుకుంటే బాగుంటుంది.

ఓ ఫారెస్ట్‌లో జింక‌లు గ‌డ్డి కోసం వెతుకుతున్నాయి. ఓ చెట్టు నిల్చున్న జింక‌లు ఆకుల‌ను తినేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. కానీ ఆకులు వాటికి అంద‌డం లేదు. జింక‌ల బాధ‌ను అర్థం చేసుకున్న కోతి త‌న తెలివిని ప్ర‌ద‌ర్శించింది.

చెట్టు కొమ్మ‌పైకి ఎక్కి.. కింద‌కు వ‌చ్చేలా దానిపై కూర్చుంది. ఆ కొమ్మ కింద‌కు వంగ‌డంతో జింక‌లు ఆకుల‌ను తిని త‌మ ఆక‌లిని తీర్చుకున్నాయి. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.