ఆ ఇద్దరు హీరోయిన్లతోనే కృష్ణ అత్యధిక సినిమాలు..
Super Star Krishna | విధాత: నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సూపర్ స్టార్ కృష్ణ.. ఆ ఇద్దరు హీరోయిన్లతోనే అత్యధిక సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. తన సతీమణి నటి విజయ నిర్మలతో 48 సినిమాల్లో నటించగా, మరో నటి జయప్రదతో కలిసి 47 సినిమాల్లో నటించారు. ఈ హీరోయిన్ల కాంబినేషన్లలో వచ్చిన సినిమాలు రికార్డులు కూడా సృష్టించాయి. కులగోత్రాలు మూవీతో సినిమా కేరీర్ ప్రారంభం.. సూపర్ స్టార్ […]

Super Star Krishna | విధాత: నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సూపర్ స్టార్ కృష్ణ.. ఆ ఇద్దరు హీరోయిన్లతోనే అత్యధిక సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. తన సతీమణి నటి విజయ నిర్మలతో 48 సినిమాల్లో నటించగా, మరో నటి జయప్రదతో కలిసి 47 సినిమాల్లో నటించారు. ఈ హీరోయిన్ల కాంబినేషన్లలో వచ్చిన సినిమాలు రికార్డులు కూడా సృష్టించాయి.
కులగోత్రాలు మూవీతో సినిమా కేరీర్ ప్రారంభం..
సూపర్ స్టార్ కృష్ణ సినిమా కేరీర్ కులగోత్రాలు మూవీతో ప్రారంభమైంది. ఈ సినిమా 1961లో వచ్చింది. ఆ తర్వాత పదండి ముందుకు, పరువు ప్రతిష్ట సినిమాల్లో చిన్న పాత్రలతో నటుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1965లో తేనె మనసులు చిత్రంలో వన్ ఆఫ్ ది లీడ్ నటుడిగా అవకాశం అందుకున్నారు.
Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ టాప్ 50 సాంగ్స్ ఇవే..
ఐదు దశాబ్దాల సినీ కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి.. సూపర్ స్టార్‌గా, నట శేఖరుడిగా కృష్ణ చెరగని ముద్ర వేసుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం 2009లో కృష్ణను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2008లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డును కూడా అందుకున్నారు సూపర్ స్టార్.
కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాలు ఇవే..
17 ఫీచర్ ఫిలిమ్స్‌తో పాటు శంఖారావం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలన్నింటిలో కుమారుడు మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. హోంబ్యానర్ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్లో తన సోదరులు ఆదిశేషగిరి రావు, హన్మంతరావు కలిసి ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించారు.
అప్పట్లో తెలుగు యాక్టర్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా అరుదైన రికార్డు కూడా కృష్ణ ఖాతాలో ఉంది. కెరీర్లో ఆదుర్తి సుబ్బారావు, వీ మధుసూదన రావు, కే విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణ రావు, కే రాఘవేంద్రరావు లాంటి దిగ్గజ దర్శకులతో కలిసి పనిచేశారు.