పోలీసుల తీరుతో ఆత్మహత్యాయత్నం.. తల్లీకూతురు మృతి

విధాత‌: ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెదవేగి మండలం గోపన్నపాలెం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు 15 ఏళ్ళ బాలికను (మైనర్) ప్రేమ పేరుతో మోటార్ బైక్‌పై తీసుకెళ్లాడు. విషయం తెలిసిన బాలిక తల్లి గల్లా దేవి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు న‌మోదు చేయ‌కుండా బాలికను రప్పించి తల్లికి అప్పగించారు. అంతేగాక ఎస్సై దుర్భాషలాడాడని బాలిక తల్లి ఆరోపించింది. ఈ ఘటనలో ఎస్ఐ తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన తల్లీకూతుళ్లు అవమానం […]

పోలీసుల తీరుతో ఆత్మహత్యాయత్నం.. తల్లీకూతురు మృతి

విధాత‌: ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెదవేగి మండలం గోపన్నపాలెం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు 15 ఏళ్ళ బాలికను (మైనర్) ప్రేమ పేరుతో మోటార్ బైక్‌పై తీసుకెళ్లాడు. విషయం తెలిసిన బాలిక తల్లి గల్లా దేవి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు న‌మోదు చేయ‌కుండా బాలికను రప్పించి తల్లికి అప్పగించారు. అంతేగాక ఎస్సై దుర్భాషలాడాడని బాలిక తల్లి ఆరోపించింది.

ఈ ఘటనలో ఎస్ఐ తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన తల్లీకూతుళ్లు అవమానం భరించలేక కూల్‌డ్రింక్ బాటిల్‌లో ఎలుకల మందు కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిస్థితి గమనించిన గ్రామస్తులు వెంటనే తల్లి కూతుళ్లను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం గల్లా అనిత (15) శనివారం గల్లా దేవి (45) మరణించారు.

ఈ ఘటనలో పెదవేగిలో పోలీసులు కేసు న‌మోదు చేసి ఉంటే తల్లికూతుళ్లు బ్రతికి ఉండేవారని దీనికి బాధ్యుడైన ఎస్ఐని సస్పెండ్ చెయ్యాలని కోరుతూ ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకుడు కందుల రమేష్ ఆధ్వర్యంలో ఎగువాడ రహదారిపై భైటాయించి ధర్నా చేశారు.

ఎస్సై సత్యనారాయణ సస్పెన్షన్

కేసు నమోదులో జాప్యం, విధులలో నిర్లక్ష్యం వహించి ఇద్దరు మహిళల మృతికి కారణమైన ఏలూరు జిల్లా పెదవేగి ఎస్సై సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు ఏలూరు రేంజ్ డీఐజీ పాల్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.