రైతు సమస్యలపై ఉద్యమించండి: MP ఉత్తమ్ పిలుపు
విధాత: కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓటర్ల నమోదు సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని అలాగే రైతాంగ సమస్యల పైన ఎక్కడికక్కడ పోరాటాలు ఉదృతం చేయాలని ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆదివారం సాయంత్రం హుజూర్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నిర్ణయం మేరకు రైతు సమస్యల పైన, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల పైన ప్రజా ఉద్యమాలు ఉధృతం చేయాలన్నారు. రైతు రుణమాఫీ, పంట బీమా, […]

విధాత: కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓటర్ల నమోదు సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని అలాగే రైతాంగ సమస్యల పైన ఎక్కడికక్కడ పోరాటాలు ఉదృతం చేయాలని ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆదివారం సాయంత్రం హుజూర్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్టీ నిర్ణయం మేరకు రైతు సమస్యల పైన, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల పైన ప్రజా ఉద్యమాలు ఉధృతం చేయాలన్నారు. రైతు రుణమాఫీ, పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత ఎరువుల హామీ, ధరణి సమస్యలపై ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఆందోళనలు చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్ సాగిస్తున్న అవినీతి కుటుంబ పాలనను ప్రజలకు వివరించి, కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలను కదిలించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.