Sanatana Dharma | సనాతనధర్మం హెచ్ఐవి లాంటిది.. డీఎంకే ఎంపీ రాజా వ్యాఖ్యలు
Sanatana Dharma | చెన్నై : సనాతన ధర్మాన్ని కరోనా, మలేరియా, డెంగ్యూలతో పోల్చుతూ మొన్న మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే.. అదే పార్టీకి చెందిన ఎంపీ డి. రాజా అలాంటివే ఇంకొన్ని కామెంట్స్ చేసి ఆ చర్చలను మరింత రగిలించారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి తక్కువ వ్యాఖ్యలు చేశారని, వాస్తవానికి సనాతన ధర్మం.. కుష్టు వంటిదని, హెచ్‌ఐవీ కంటే ప్రాణాంతకమైనదని రాజా అభివర్ణించారు. ఈ […]

Sanatana Dharma | చెన్నై : సనాతన ధర్మాన్ని కరోనా, మలేరియా, డెంగ్యూలతో పోల్చుతూ మొన్న మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే.. అదే పార్టీకి చెందిన ఎంపీ డి. రాజా అలాంటివే ఇంకొన్ని కామెంట్స్ చేసి ఆ చర్చలను మరింత రగిలించారు.
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి తక్కువ వ్యాఖ్యలు చేశారని, వాస్తవానికి సనాతన ధర్మం.. కుష్టు వంటిదని, హెచ్‌ఐవీ కంటే ప్రాణాంతకమైనదని రాజా అభివర్ణించారు. ఈ అంశం మీద ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, శంకరాచార్యులు ఇలా ఎవరైనా సరే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
అయితే.. ఉదయనిధి తర్వాత రాజా సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ పేర్కొన్నారు. ఇది సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న దేశంలోని 80 శాతం మందిని అవమానించడమేనని అన్నారు.