MP KomatiReddy: కవితకు ED నోటీసులపై రేవంత్ ఎందుకు స్పందించలేదు: MP వెంకట్ రెడ్డి

MP KomatiReddy.. MLC Kavitha.. RevanthReddy విధాత: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఈ రోజు ఉదయం ఈడి నోటీసులు(ED Notice) జారీ చేయగా ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(RevanthReddy) ఎందుకు స్పందించలేదని మాజీ మంత్రి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP KomatiReddy) ప్రశ్నించారు. కవితకు నోటీసులపై స్పందించాలని మీడియా ఆయనను కోరగా దీనిపై తాను మాట్లాడబోనని ఆ విషయంపై రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని సూచించారు. ఉదయం నుండి కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన […]

MP KomatiReddy: కవితకు ED నోటీసులపై రేవంత్ ఎందుకు స్పందించలేదు: MP వెంకట్ రెడ్డి

MP KomatiReddy.. MLC Kavitha.. RevanthReddy

విధాత: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఈ రోజు ఉదయం ఈడి నోటీసులు(ED Notice) జారీ చేయగా ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(RevanthReddy) ఎందుకు స్పందించలేదని మాజీ మంత్రి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP KomatiReddy) ప్రశ్నించారు.

కవితకు నోటీసులపై స్పందించాలని మీడియా ఆయనను కోరగా దీనిపై తాను మాట్లాడబోనని ఆ విషయంపై రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని సూచించారు. ఉదయం నుండి కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఈడి నోటీసులపై రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదో ఆయననే అడగాలన్నారు. ఎంపీగా తన పనులు తనకున్నాయన్నారు.