కాళ్ల బేరానికి వచ్చినా బీఆరెస్‌తో బీజేపీ పొత్తు ఉండదు

బీఆరెస్‌ కాళ్ల బేరానికి వచ్చినా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు ఉండబోదని బీజేపీ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. మంగళవారం భైంసాలో విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ తలకిందులుగా తపస్సు చేసినా కేసీఆర్‌ను దగ్గరకు రానివ్వమన్నారు

  • Publish Date - February 20, 2024 / 11:12 AM IST
  • బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టీకరణ


విధాత, హైదరాబాద్ : బీఆరెస్‌ కాళ్ల బేరానికి వచ్చినా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు ఉండబోదని బీజేపీ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. మంగళవారం భైంసాలో విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ తలకిందులుగా తపస్సు చేసినా కేసీఆర్‌ను దగ్గరకు రానివ్వమన్నారు. “మజ్లిస్ పార్టీతో దోస్తాన్ చేసిన బీఆరెస్‌కు బీజేపీ చాలా దూరంగా ఉంటుందన్నారు. తీవ్ర నిరాశలో ఉన్న బీఆరెస్ పార్టీ నుంచి భారీగా వలసలు పెరగనున్నాయన్నారు. ఉనికి కాపాడుకునేందుకే బీఆరెస్ నేతలు పొత్తుల ప్రచారం సాగిస్తుందన్నారు.


ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉందన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణ విషయంలో రాహుల్, సోనియా గాంధీలు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, రాముడిని అవమానించే రీతిలో మాట్లాడి, ఆలయ నిర్మాణాన్ని హేళన చేశారన్నారు. ప్రస్తుతం ఓట్ల కోసం వారు రామ నామ జపం చేస్తున్నారన్నారు. ఓబీసీ రిజర్వేషన్లను నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకించారని, ఎన్నికల్లో లబ్ధి కోసం రాహుల్ ప్రస్తుతం ఓబీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి తెస్తున్నారని లక్ష్మణ్  విమర్శించారు.