Mrunal Thakur | లక్కీ చాన్స్ కొట్టేసిన సీతారామం బ్యూటీ..! రామ్‌చరణ్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్
Mrunal Thakur | ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కుతు న్నది. సినిమా కాస్టింగ్ ప్రేక్షకుల్లో అభిమానులను రేకెత్తిస్తున్నది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో వివిధ భాషలకు చెందిన అగ్ర నటీ నటనులను, సాంకేతిక నిపుణులను తీసుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో మూవీ తెరక్కనున్నది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. తాజాగా హీరోయిన్‌ను సైతం మేకర్స్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తున్నది. ఈ […]

Mrunal Thakur | ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కుతు న్నది. సినిమా కాస్టింగ్ ప్రేక్షకుల్లో అభిమానులను రేకెత్తిస్తున్నది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో వివిధ భాషలకు చెందిన అగ్ర నటీ నటనులను, సాంకేతిక నిపుణులను తీసుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో మూవీ తెరక్కనున్నది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు.
తాజాగా హీరోయిన్‌ను సైతం మేకర్స్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తున్నది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌తో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జతకట్టనున్నట్లు సమాచారం. ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో జాన్వీ స్థానంలో మృణాల్‌ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని బుచ్చిబాబు తెరకెక్కించనున్నారు.
ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్న చిత్రంలో రామ్‌చరణ్ క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుందని టాక్. మరో వైపు ఈ చిత్రంలో కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
దాదాపు రూ.100కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ లేదంటే సెప్టెంబర్‌లో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీని వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సహనిర్మాణ సంస్థగా వ్యవహరించనున్నది.