Ms Dhoni | ధోని ఇంట్లో ఉన్న బైక్స్, కార్లు చూసి బిత్త‌ర‌పోయిన మాజీ క్రికెటర్

Ms Dhoni:  టీమిండియా మాజీ క్రికెట‌ర్ ధోనికి బైక్స్ అంటే ఎత్త పిచ్చి ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మార్కెట్ లోకి కొత్త బైక్ వ‌చ్చిందంటే అది క‌చ్చితంగా ధోని గ్యారేజ్‌లో ఉండి తీరాల్సిందే. ఇప్ప‌టికే ఎన్నో ర‌కాల బైకుల‌ని కొనుగోలు చేసిన ధోని వాటిని చాలా భ‌ద్రంగా దాచుకున్నాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రూపంలో వచ్చిన బైక్స్ కూడా త‌న గ్యారేజ్‌లో పెట్టుకున్నాడు. అయితే ఎప్ప‌టి నుండో ధోని గ్యారేజ్‌కి సంబంధించి ఎన్నో వార్త‌లు వ‌స్తుండేవి. […]

  • By: sn    latest    Jul 18, 2023 4:25 AM IST
Ms Dhoni | ధోని ఇంట్లో ఉన్న బైక్స్, కార్లు చూసి బిత్త‌ర‌పోయిన మాజీ క్రికెటర్

Ms Dhoni: టీమిండియా మాజీ క్రికెట‌ర్ ధోనికి బైక్స్ అంటే ఎత్త పిచ్చి ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మార్కెట్ లోకి కొత్త బైక్ వ‌చ్చిందంటే అది క‌చ్చితంగా ధోని గ్యారేజ్‌లో ఉండి తీరాల్సిందే. ఇప్ప‌టికే ఎన్నో ర‌కాల బైకుల‌ని కొనుగోలు చేసిన ధోని వాటిని చాలా భ‌ద్రంగా దాచుకున్నాడు.

‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రూపంలో వచ్చిన బైక్స్ కూడా త‌న గ్యారేజ్‌లో పెట్టుకున్నాడు. అయితే ఎప్ప‌టి నుండో ధోని గ్యారేజ్‌కి సంబంధించి ఎన్నో వార్త‌లు వ‌స్తుండేవి. ఆయ‌న గ్యారేజ్ లో ఖ‌రీదైన బైకులతో పాటు కార్లు ఉన్నాయ‌ని వాటి ధ‌ర ల‌క్ష‌ల్లోనే ఉంటుంద‌ని ముచ్చ‌టించుకునే వారు.

అయితే తాజాగా రాంఛీలోని మహేంద్ర సింగ్ ధోనీ ఇంటికి వెళ్లిన భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్.. ఆయ‌న గ్యారేజ్ చూపించి అభిమానుల‌కి ఆనందం క‌లిగించాడు. వెంక‌టేష్ ప్ర‌సాద్ షేర్ చేసిన వీడియోలో మ‌హీ బైక్ క‌లెక్ష‌న్స్ ఉండ‌గా, ఒక వ్యక్తిలో నేను చూసిన క్రేజీయెస్ట్ ప్యాషన్ ఇదే అని చెప్పుకొచ్చాడు.

మ‌హీ దగ్గర ఉన్న కలెక్షన్ చూసి షాక్ అయ్యా. అతను అద్భుతమైన విజయాలు అందుకున్న సారథి, అంతకన్నా మంచి మనిషి కూడా. రాంచీలోని తన ఇంట్లో ఉన్న బైక్స్, కార్ల కలెక్షన్లలో ఓ భాగం ఉంది. ఇతన్ని, ఇతని ప్యాషన్‌ని చూసి నా బుర్ర బ‌ద్ధ‌లైంద‌ని భార‌త మాజీ బౌల‌ర్ వెంక‌టేష్ ప్ర‌సాద్ త‌న ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చాడు.

దీనిని ఎవరైనా చూస్తే బైక్ షో రూమ్ అనుకుంటారు. అస‌లు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి అంటూ వెంక‌టేష్ ప్ర‌సాద్ స‌ర‌దాగా చెప్పుకొచ్చాడు. అయితే ఈ మొత్తం సెటప్ చూశాక మాటలు రావడం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ జోషి అన్నారు.

ఇక మాహీ బైక్ కలెక్షన్‌లో 100కి పైగా బైకులు ఉండగా, పదుల సంఖ్యలో కార్లు ఉన్నాయి. ఇందులో రూ.30 వేలతో మొదలయ్యే యమహా బైక్ దగ్గర్నుంచి కాస్ట్ లీ కన్ఫిడరేట్ హెల్ క్యాట్ బైక్ కూడా ఉంది. వీట‌న్నింటిపై ధోని అప్పుడ‌ప్పుడు షికార్లు వేస్తుంటాడు.