వైసీపీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ

ఏపీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరిలు వైసీపీ కండువ కప్పుకున్నారు

  • By: Somu    latest    Mar 15, 2024 12:13 PM IST
వైసీపీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్‌


విధాత : ఏపీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరిలు వైసీపీ కండువ కప్పుకున్నారు. ‌గత కొన్ని నెలలుగా ముద్రగడ ఏ పార్టీలో చేరుతారన్న చర్చ జోరుగా సాగింది. చివరకు ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరడం తనకు సంతోషంగా ఉందని, ఎన్నికల్లో జగన్‌ గెలుపు కోసం కృషి చేస్తానని ముద్రగడ పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిలు పాల్గొన్నారు.