Mudragada Padmanabham | వైసిపిలోకి ముద్రగడ పద్మనాభం.. పిఠాపురం టికెట్ ఇస్తారా

Mudragada Padmanabham విధాత‌: ఏపీ రాజకీయాల్లో రోజురోజుకూ మలుపులు.. మెరుపులు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో వాతావరణం వేడెక్కుతోంది. ఎలాగైనా రెండోసారి గెలవాలని జగన్ ప్రయత్నిస్తుండగా… ఒక్కచాన్స్ ఇచ్చారు… సరిపోతుంది.. ఇక దిగండి మేము రాజ్యం ఏలతాం అని టిడిపి అంటోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం ఎలాగైనా జగన్ను దించి తీరతాను అని ప్రతిన బూనుతున్నారు. జగన్ను దించాల్సిందే అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో అయన పని చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కాపులతోబాటు, ఉత్తరాంధ్ర, […]

Mudragada Padmanabham | వైసిపిలోకి ముద్రగడ పద్మనాభం.. పిఠాపురం టికెట్ ఇస్తారా

Mudragada Padmanabham

విధాత‌: ఏపీ రాజకీయాల్లో రోజురోజుకూ మలుపులు.. మెరుపులు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో వాతావరణం వేడెక్కుతోంది. ఎలాగైనా రెండోసారి గెలవాలని జగన్ ప్రయత్నిస్తుండగా… ఒక్కచాన్స్ ఇచ్చారు… సరిపోతుంది.. ఇక దిగండి మేము రాజ్యం ఏలతాం అని టిడిపి అంటోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం ఎలాగైనా జగన్ను దించి తీరతాను అని ప్రతిన బూనుతున్నారు. జగన్ను దించాల్సిందే అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో అయన పని చేస్తున్నారు.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కాపులతోబాటు, ఉత్తరాంధ్ర, గుంటూరులోని కొన్ని కాపు ప్రభావిత ప్రాంతాలు ఆయన లిస్ట్ లో ఉన్నాయ్. ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ ఓట్లు ఎత్తుకెళ్లే లక్ష్యంతో అయన పని చేస్తున్నారు. ఇక టిడిపికి సపోర్ట్ చేస్తారా.. సీట్ల షేరింగ్ ఉంటుందా అన్నది ఆయన ఇంకా చెప్పలేదు. ఐతే పవన్ కళ్యాణ్ వల్ల ఎంతోకొంత కాపు వోటింగ్ నష్టం జరుగుతుందని లెక్క వేసిన జగన్ ఈమేరకు డ్యామేజీ కంట్రోల్ కోసం ప్లాన్- బి సిద్ధం చేసారు.

సీనియర్ కాపునాయకుడు ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే ఆయనతో పలుమార్లు వైసిపి నాయకులూ చర్చలు జరిపారు. ఆయన వస్తే గోదావరి జిల్లాల్లో వైసిపికి మంచి పట్టు దొరికినట్లేనని అంటున్నారు.

ఆయన్ను టిడిపి ప్రభుత్వం ఎలా ఇబ్బంది పెట్టింది అందరికి తెలిసిందే. ఆయన్ను, భార్యాబిడ్డలను సైతం కాపు ఉద్యమం రోజుల్లో పోలీసులతో కొట్టించి, కాళ్ళతో తన్నించిన చంద్రబాబుకు ఎలాగైనా స్ట్రాంగ్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ముద్రగడ కూడా చూస్తున్నారు.

ఈక్రమంలోనే అయన జగన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఈమధ్యనే తుని రైల్ దగ్ధం కేసులన్నీ కొట్టేసిన జగన్ ప్రభుత్వం ముద్రగడకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. అంతేకాకుండా ముద్రగడకు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ సైతం ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పిఠాపురం నుంచి పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు.. ఆయన్ను ఇంకోచోట ఎకామిడేట్ చేసి ముద్రగడకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారని అంటున్నారు.

ముద్రగడ వస్తే ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో జగన్ పార్టీకి మంచి మద్దతు దొరుకుతుందని అంటున్నారు. పైగా ముద్రగడ మీద ప్రజల్లో నెగటివ్ ఇమేజి లేదు.. నిజాయితీగా కులం కోసం పని చేయడమే తప్ప అవినీతి, ఇతరత్రా చిల్లర వ్యవహారాల్లో ఆయన ఎన్నడూ దూరింది లేదు. కాబట్టి అయన చేరిక పార్టీకి పెద్ద ప్లస్ అవుతుందని వైసిపి భావిస్తోంది.