Mulugu | చిన్నారుల పెద్ద మనసు.. వరద బాధితులకు రూ.50 వేల ప్యాకెట్ మనీ సాయం

Mulugu | రూ.లక్ష అందించిన ఐవీవై స్కూల్ యాజమాన్యం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వరద బాధితుల సహాయార్థం ఐవీవై ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పెద్ద మనసు చాటుకున్నారు. తమ ప్యాకెట్ మనీ రూ.50 వేలు, స్కూల్ యాజమాన్యం రూ.లక్ష విరాళంగా సేకరించారు. ములుగులో బుధవారం స్థానిక ఎమ్మెల్యే దనసరి సీతక్కకు ఆర్థిక సాయం అందజేశారు. రూ.1.50 లక్షల నగదును మేడారంలో నష్టపోయిన 150 షాపులకు వెయ్యి చొప్పున ఎమ్మెల్యే అందజేశారు. […]

  • By: krs    latest    Sep 20, 2023 3:54 PM IST
Mulugu | చిన్నారుల పెద్ద మనసు.. వరద బాధితులకు రూ.50 వేల ప్యాకెట్ మనీ సాయం

Mulugu |

రూ.లక్ష అందించిన ఐవీవై స్కూల్ యాజమాన్యం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వరద బాధితుల సహాయార్థం ఐవీవై ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పెద్ద మనసు చాటుకున్నారు.

తమ ప్యాకెట్ మనీ రూ.50 వేలు, స్కూల్ యాజమాన్యం రూ.లక్ష విరాళంగా సేకరించారు. ములుగులో బుధవారం స్థానిక ఎమ్మెల్యే దనసరి సీతక్కకు ఆర్థిక సాయం అందజేశారు. రూ.1.50 లక్షల నగదును మేడారంలో నష్టపోయిన 150 షాపులకు వెయ్యి చొప్పున ఎమ్మెల్యే అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి పాల్గొన్నారు.