Mulugu |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వంతెన పైనుండి కారు అదుపుతప్పి వాగులో పడిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం బోర్ నర్సాపూర్ గ్రామానికి చెందిన సందీప్ (19) మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వంతెనపై నుండి కారుతో వెళ్తుండగా కారు అదుపుతప్పి వాగులో పడిపోయింది.
ఈ ఘటనలో కారుతో సహా నీట మునిగిన సందీప్ ఊపిరాడక మృతి చెందాడు. అప్పటికే గమనించిన స్థానికులు హుటాహుటిన కారును బయటికి తీసినప్పటికీ సందీప్ ను కాపాడలేకపోయారు.