ముందస్తు లేదు.. కానీ.. ఇదంతా దేనికి సంకేతం?
మళ్లీ సిట్టింగ్‌లకే టికెట్లు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు మంత్రులపై అదనపు బాధ్యతలు ఉన్నమాట: నిన్న జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పక్ష, పార్టీ కార్యవర్గ సంయుక్త సమావేశంలో ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇస్తామన్నారు. 95పైగా సీట్లు టీఆర్‌ఎస్ గెలువబోతున్నదని అన్ని సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయన్నారు. అలాగే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండాలని, ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఇన్‌చార్జి ఎమ్మెల్యేలు […]

- మళ్లీ సిట్టింగ్‌లకే టికెట్లు
- ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు
- మంత్రులపై అదనపు బాధ్యతలు
ఉన్నమాట: నిన్న జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పక్ష, పార్టీ కార్యవర్గ సంయుక్త సమావేశంలో ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇస్తామన్నారు. 95పైగా సీట్లు టీఆర్‌ఎస్ గెలువబోతున్నదని అన్ని సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయన్నారు. అలాగే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండాలని, ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
ప్రతి నియోజకవర్గానికి ఇన్‌చార్జి
ఎమ్మెల్యేలు వందమందికో ఇన్‌ఛార్జిని నియమించుకోవాలని, ఎన్నికల ఏడాదిలోకి వచ్చాం కాబట్టి రాజకీయ కోణంలోనే పనిచేయాలన్నారు. సీఎం కేసీఆర్ గతంలో వలె ముందస్తు వెళ్తారనే ప్రచారం జరిగినా అదేమీ లేదని కొంతకాలంగా చెబుతున్నారు. నిన్నటి సమావేశంలోనూ అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సంవత్సరంలోకి వచ్చాం, ప్రతి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిని నియమిస్తాం. ప్రతి మంత్రి మరో ఎమ్మెల్యేను గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
లేవంటే.. ఉన్నాయనేనా
నిన్నటి సమావేశంలో సీఎం మాట్లాడిన మాటలు గమనిస్తే రేవంత్‌రెడ్డి అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి. కేసీఆర్ ఏదైనా చెప్పారు అంటే దానికి విరుద్ధంగా ఆయన ఆచరణ ఉంటుంది. అంటే దాని అర్థం ముందస్తు లేవు అంటే ఉంటాయని అనుకోవాలి. దానికి అనుగుణంగానే ఆయన ఎన్నికలకు నేతలను సన్నద్ధం చేసే పనిలో ఉన్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
95 సీట్లు మావే..
ప్రస్తుతం కేంద్రంతో సఖ్యత లేకపోవడం, గవర్నర్‌తో విభేదాల కారణంగా ముందస్తు ఎన్నికల అంశాన్ని పక్కనపెట్టి ఉండవచ్చు. కానీ పరిస్థితులకు అనుగుణంగా టీఆర్‌ఎస్ అధినేత ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కేసీఆర్ చెప్పినట్లు 95 పైగా సీట్లు వస్తాయా లేదా అన్నది చెప్పలేం. కానీ అదిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్ నిలిచే అవకాశాలు మాత్రం లేకపోలేదు.
రెండో స్థానంలో ఎవరో..
రెండో స్థానంలో కాంగ్రెస్ ఉండవచ్చు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడినా రాష్ట్రంలో ప్రజలు బీజేపీనే ప్రత్యామ్నాయం అనుకుంటున్నారని ప్రధాని మొదలు బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న బలం చూసిన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకత్వానికి అలాంటి నమ్మకాలేవీ లేవు.
అన్నీ అనుకూలిస్తే..
మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాల మద్దతు తీసుకున్నారు. కేసీఆర్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోను బీజేపీకి చెక్ పెట్టడానికి వామపక్షాలతో పాటు, ఎంఐఎంతో ముందస్తు అవగాహన కుదుర్చుకునే అవకాశాలు లేకపోలేదు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడుతాయి. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోగా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసి అన్నీ అనుకూలిస్తే కేసీఆర్ గతంలో వలె ఆరు నెలల ముందే ముందస్తు నిర్ణయం తీసుకోవచ్చు.