‘18’ నిండిన వారు.. తప్పనిసరిగా ఓటు నమోదు చేయించుకోవాలి

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి: ఓటు హక్కు ఎంతో విలువైనదని 18 ఏళ్ళు నిండిన ప్రతి యువత నైతిక భాద్యతగా తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ అన్నారు. ప్రత్యేక ఓటర్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం కౌడిపల్లిలో నాలుగు పోలింగ్ బూతులను అదనపు కలెక్టర్ రమేశ్‌తో కలిసి సందర్శించి ఓటరు జాబితా, ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన ఏ ఒక్కరు […]

  • By: krs    latest    Nov 26, 2022 10:53 AM IST
‘18’ నిండిన వారు.. తప్పనిసరిగా ఓటు నమోదు చేయించుకోవాలి

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి: ఓటు హక్కు ఎంతో విలువైనదని 18 ఏళ్ళు నిండిన ప్రతి యువత నైతిక భాద్యతగా తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ అన్నారు. ప్రత్యేక ఓటర్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం కౌడిపల్లిలో నాలుగు పోలింగ్ బూతులను అదనపు కలెక్టర్ రమేశ్‌తో కలిసి సందర్శించి ఓటరు జాబితా, ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన ఏ ఒక్కరు మిగిలిపోకుండా ఓటరుగా నమోదు చేయాలని కౌడిపల్లి తహశీల్ధార్‌కు, బూతు స్థాయి అధికారులకు సూచించారు.

ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం-6, చనిపోయిన వారిని తొలగించుటకు ఫారం-7, ఆధార్ లింక్‌కు ఫారం -6a, చిరునామా మార్పునకు ఫారం-8 వంటివి అన్ని సిద్ధంగా ఉంచుకొని ఆదివారం, తిరిగి డిసెంబర్ 3,4 తేదీలలో నిర్వహించే ప్రత్యేక డ్రైవ్‌ లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు బూతు స్థాయిలో అందుబాటులో ఉండి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాలకే పరిమితం కాకుండా 576 పోలింగ్ బూత్ స్థాయి బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు, ట్రాన్స్ జెండర్లు, దివ్యంగులను గుర్తించి గరుడ యాప్ లేదా ఫారం-6 ద్వారా చక్కటి టీమ్ వర్క్ తో ప్రణాళికా బద్ధంగా ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టి వంద శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు.

అదేవిధంగా nvsp పోర్టల్ ద్వారా, ఓటర్ హెల్ప్ లైన్ ఆప్, ఓటర్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో కూడా ఓటరుగా ఏడాదిలో నాలుగు పర్యాయాలు అనగా జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 నమోదు చేసుకోవచ్చని, యువతకు అవగాహన కలిగించాలన్నారు. డిసెంబర్ 8 వరకు ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు , సవరణలు చేసుకోవచ్చని, జనవరి 5, 2023న ఓటరు తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఓటర్ల ముసాయిదా ప్రకారం జిల్లాలోని మెదక్ నియోజక వర్గంలో 2,01,358 మంది ఓటర్లు, నరసాపూర్ నియోజక వర్గంలో 2,05,271 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ హరీష్ తెలిపారు. కార్యక్రమంలో కౌడిపల్లి తహశీల్ధార్ కమాలాద్రి, బూత్ స్థాయి, అధికారులు పాల్గొన్నారు.