నా తనయుడు అమిత్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు: శాసనమండలి చైర్మన్ గుత్తా
విధాత: అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్రం కక్ష పురితంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా తయారైందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నల్గొండలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం ఒకవైపు తెలంగాణ ప్రగతికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తూనే మరోవైపు ఇక్కడ అధికారంలోకి రావాలని బీజేపీ కుయుక్తులు చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంపై రాజకీయ, ఆర్ధిక దాడులు చేస్తున్న బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందంటూ ప్రశ్నించారు. రాష్ట్ర […]

విధాత: అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్రం కక్ష పురితంగా వ్యవహరిస్తోందని,
రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా తయారైందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నల్గొండలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం ఒకవైపు తెలంగాణ ప్రగతికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తూనే మరోవైపు ఇక్కడ అధికారంలోకి రావాలని బీజేపీ కుయుక్తులు చేస్తుందని దుయ్యబట్టారు.
రాష్ట్రంపై రాజకీయ, ఆర్ధిక దాడులు చేస్తున్న బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందంటూ ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ రాష్ట్ర ప్రజలనే ఓట్లు అడగడం బిజెపికే చెల్లిందన్నారు. దేశ రాజకీయాల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్లుగా ముందెన్నడూ ఏ కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యవస్థలను దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయలేదని విమర్శించారు.
రాజకీయాల్లో ఇలాంటి పోకడలు చాలా ప్రమాదకరమని, లిస్ట్ తయారీ చేసి మరి బీజేపీ కేంద్ర సంస్థలతో దాడులు చేస్తుండడం అప్రజాస్వామికంగా ఉందన్నారు. ఇప్పటికే దేశంలో రాజకీయాలు బ్రష్టు పట్టాయని.. బీజేపీ చేస్తున్న చర్యలు రాజకీయాలు అంటేనే ప్రజలు ఈసడిoచుకునేల చేస్తున్నాయన్నారు.
తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోత పెట్టి, కేంద్రం ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని, రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.40వేల కోట్ల ఆర్ధిక వనరులు రాకుండా అడ్డుకునేలా చేసి ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆటంకాలు కల్పించే కుట్రలు చేస్తుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం బీజేపీకి తగదని, తెలంగాణ ప్రజల చైతన్యవంతులని బీజేపీ కుట్రపూరిత, రాజకీయ కక్షపూరిత వైఖరులను గమనిస్తున్నారని ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
ఇకనైనా బీజేపీ తెలంగాణపై కక్షపూరిత రాజకీయాలు విడనాడి తెలంగాణకు రావలసిన నిధులను అందించి, ప్రాజెక్టులను, పథకాలను కొనసాగించేలా తోడ్పాటు అందించాలని రాష్ట్ర విభజన హామీలను అమలుపరచాలని లేదంటే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదన్నారు.
అమిత్ రెడ్డికి రాజకీయాలంటే ఆసక్తి:
తన తనయుడు అమిత్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తే తాను వద్దనబోనని, ప్రజలతో మమేకమై, ప్రజా సంక్షేమానికి పాటు పడేవారికి ప్రజల్లో ఆదరణ ఉంటుందన్నారు. అమిత్ రెడ్డికి రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని, సరైన అవకాశం చూసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్నరు.