Mynampally | వారం తర్వాత నిర్ణయం: మైనంపల్లి

Mynampally | విధాత: వారం రోజుల తర్వాతా భవిష్యత్తు రాజకీయాలపై నిర్ణయం ప్రకటిస్తానని మల్కాజీగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. శనివారం మెదక్‌, మల్కాజిగిరి బీఆరెస్ కార్యక్తరలు, అనుచరులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపటి నుంచి వారం రోజుల పాటు వారం మల్కాజిగిరి ప్రజల్లో తిరుగుతునని, వారం తర్వాతా మీడియాను పిలిచి నిర్ణయం చెబుతానన్నారు. కాగా.. వారం రోజుల పాటు విమర్శలకు దూరంగా ప్రజాప్రాయ సేకరణ పనిలో ఉంటానన్నారు. నన్నూ వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే […]

  • By: Somu    latest    Aug 26, 2023 10:53 AM IST
Mynampally | వారం తర్వాత నిర్ణయం: మైనంపల్లి

Mynampally |

విధాత: వారం రోజుల తర్వాతా భవిష్యత్తు రాజకీయాలపై నిర్ణయం ప్రకటిస్తానని మల్కాజీగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. శనివారం మెదక్‌, మల్కాజిగిరి బీఆరెస్ కార్యక్తరలు, అనుచరులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపటి నుంచి వారం రోజుల పాటు వారం మల్కాజిగిరి ప్రజల్లో తిరుగుతునని, వారం తర్వాతా మీడియాను పిలిచి నిర్ణయం చెబుతానన్నారు.

కాగా.. వారం రోజుల పాటు విమర్శలకు దూరంగా ప్రజాప్రాయ సేకరణ పనిలో ఉంటానన్నారు. నన్నూ వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే చూస్తు ఊరుకునేది లేదన్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం నా నైజమని, రాజకీయాల కోసం పార్టీ మారే వ్యక్తికాదన్నారు.

నన్నూ ఎవరు ఇబ్బంది పెట్టినా తిడుతానని, నేను ఎవరిని వ్యక్తిగతంగా తిట్టనన్నారు. తొందర పడవద్దని శ్రేయోభిలాషులు సూచించడంతో వారం రోజుల తర్వారా మీడియాను పిలిచి అన్ని విషయాలు ప్రకటిస్తానన్నారు.

నాకు రాజకీయ భిక్ష పెట్టింది మెదక్ ప్రజలని, బీఆరెస్‌లో అణిచివేతకు గురవుతున్నామన్న మెదక్‌ కార్యకర్తల ఆవేదన మేరకే తన కుమారుడు మెదక్‌లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని మైనంపల్లి స్పష్టం చేశారు. సొంత పార్టీ కార్యకర్తలపైనే మెదక్‌లో కేసులు పెట్టి వేధించారన్నారు.

నా కొడుకు నాకంటే ఎక్కువ పని చేస్తున్నారని, ఆయనను సెట్ చేయాల్సివుందని, కోవిడ్ టైమ్‌లో మెదక్ ప్రజల కోసం 8కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు నిర్వహించాడన్నారు. నన్ను తిట్టెవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని, నేను పార్టీని ఏమనలేదని, నన్ను పార్టీ ఏమనలేదని, మెదక్ ప్రజలు ఏది చెబితే నా కొడుకు అది చేస్తాడన్నారు.