Jailer 2: ‘జైలర్ 2’లోకి నాగార్జున?..ఇప్పటికే బాలయ్య కన్ ఫర్మ్!

Jailer 2:: రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న జైలర్ 2 సినిమా నిర్మాణ సమయంలోనే ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుతోంది. సినిమాలో ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ ప్రధాన పాత్రలో నటించేందుకు ఆమోదం తెలిపారు. ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య కనిపించనున్నారు. ఇది ఇలా ఉండగానే జైలర్ 2 మూవీలో టాలీవుడ్ మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సైతం నటించే చాన్స్ ఉందని మూవీ వర్గాల కథనం. సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం నాగ్ పేరు పరిశీలన ఉన్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని..త్వరలోనే నాగ్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముందని తెలుస్తుంది. గతంలో రజనీకాంత్ ‘కూలీ’లో నాగ్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
జైలర్ చిత్రం రజనికాంత్ కేరీర్ లో రూ.600కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. జైలర్ మూవీలో అతిథి పాత్రల్లో అలరించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లు జైలర్ 2లో కూడా కొనసాగుతున్నారు. .జైలర్ 2లో కొత్తగా బాలయ్య తో పాటు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ , తమిళ్ స్టార్ ఎస్.జే.సూర్య నటిస్తున్నారు. ఇప్పుడు నాగార్జున కూడా తోడైన పక్షంలో జైలర్ 2 బాక్సాఫీస్ ను షేక్ చేయకతప్పందంటున్నారు అభిమానులు.