Nalgonda
విధాత: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువు పండుగకు వెళ్లి తిరిగి వెళుతున్న గ్రామస్తుల ఆటో ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు.
నల్గొండ (Nalgonda) జిల్లా డిండి మండలం దాసరి నెమలిపూర్ తండా గ్రామస్తులు ఆటోలో ఎర్రగుంట చెరువు వద్దకు వచ్చి ఉత్సవాల్లో భోజనం అనంతరం తిరిగి వెళుతుండగా వారి ఆటోను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది.
ప్రమాదంలో పాండు( 48) మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.
నిన్న జరిగిన చెరువుల పండుగ సందర్భంగా, నల్లగొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం, దాసరి నెమిలిపూర్ గ్రామానికి చెందిన శ్రీ వడిత్య పాండు ప్రమాదంలో మరణించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.…
— Telangana CMO (@TelanganaCMO) June 9, 2023
ముఖ్యమంత్రి సంతాపం
నిన్న జరిగిన చెరువుల పండగ సందర్భంగా, నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం దాసరి నెమిలిపూర్ గ్రామానికి చెందిన వడిత్య పాండు, ప్రమాదంలో మరణించడం పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ అభ్యర్థన మేరకు వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను సిఎం ప్రకటించారు.