Nalgonda | అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. 32 లక్షల బంగారు నగలు, వెండి స్వాధీనం
Nalgonda | విధాత: నల్లగొండలో రాత్రి వేళలో తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 32 లక్షల విలువైన 51 తులాల తొమ్మిది గ్రాముల బంగారు ఆభరణాలు, 34 తులాల వెండి, మూడు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ ఫోన్లు, ఒక టాబ్ స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ ఎస్పీ అపూర్వ రావు తెలిపారు. కనగల్ కు చెందిన రుద్రాక్ష శ్రీను, […]

Nalgonda |
విధాత: నల్లగొండలో రాత్రి వేళలో తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 32 లక్షల విలువైన 51 తులాల తొమ్మిది గ్రాముల బంగారు ఆభరణాలు, 34 తులాల వెండి, మూడు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ ఫోన్లు, ఒక టాబ్ స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ ఎస్పీ అపూర్వ రావు తెలిపారు.
కనగల్ కు చెందిన రుద్రాక్ష శ్రీను, కర్నూలు జిల్లా కొత్తపేటకు చెందిన శనివారపు భాస్కర్ రెడ్డి, నంద్యాలకు చెందిన ఎలకపాటి అరుణ్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కనగల్ కు చెందిన నిందితుడు రుద్రాక్ష శ్రీను గతంలో పీడీ యాక్ట్ లో జైలుకు వెళ్లి వచ్చాడని, అతనిపై 50కి పైగా కేసులు ఉన్నాయని, కొత్తగా మరో 18 కేసుల్లో అరెస్ట్ చేశారని తెలిపారు.
వారి వద్ద నుండి చోరీ చేసిన సొత్తును కొనుగోలు చేసిన మరో నలుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన సిసిఎస్ డిఎస్పీ నరసింహారెడ్డి, టూ టౌన్ సిఐ ప్రసాద్, సిసిఎస్ సిఐ జితేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎస్సై మహేందర్, రాజశేఖర్ రెడ్డి, సైదులు, సిబ్బంది శంషుద్దీన్ ,శంకర్, బాలకోటి, విష్ణువర్ధన్ గిరి, రాంప్రసాద్, కూడా మోహిన్ పాషాలను ఎస్పీ అభినందించారు.