Nalgonda | పరీక్షలు నిర్వహించలేని.. ఉద్యోగాలు భర్తీ చేయలేని KCR ఉద్యోగాన్ని ఊడకొట్టాలి: రేవంత్ రెడ్డి
Nalgonda తెలంగాణలో రెట్టింపైన నిరుద్యోగం.. నల్గొండ నిరుద్యోగ నిరసన ర్యాలీలో రేవంత్ పిలుపు విధాత: రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించలేని, ఉద్యోగాలు భర్తీ చేయలేని అసమర్ధ సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొట్టి ,ప్రభుత్వాన్ని గద్దతించేందుకు తెలంగాణ నిరుద్యోగ యువత ప్రజానీకం కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని పిసిసి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుండి శుక్రవారం నల్గొండ గడియారం సెంటర్ వరకు నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీ ముగింపు సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. […]

Nalgonda
- తెలంగాణలో రెట్టింపైన నిరుద్యోగం..
- నల్గొండ నిరుద్యోగ నిరసన ర్యాలీలో రేవంత్ పిలుపు
విధాత: రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించలేని, ఉద్యోగాలు భర్తీ చేయలేని అసమర్ధ సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొట్టి ,ప్రభుత్వాన్ని గద్దతించేందుకు తెలంగాణ నిరుద్యోగ యువత ప్రజానీకం కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని పిసిసి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుండి శుక్రవారం నల్గొండ గడియారం సెంటర్ వరకు నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీ ముగింపు సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
కెసిఆర్ అసమర్థ పాలనలో పది ప్రశ్న పత్రాలు వాట్సాప్ లో ప్రత్యక్షమవగా, ఇంటర్ పరీక్షల పేపర్ల దిద్దడంలో తప్పులతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు అంగట్లో సరుకులా మారిపోయాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. 1200 మంది విద్యార్థుల బలిదానాలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రం బంగారమయం చేసుకున్నాడు అన్నారు.
ముఖ్యమంత్రిగా తొలి ఏడాది కేసీఆర్ అసెంబ్లీలో 1లక్ష 7వేలు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పారని, 9 ఏండ్ల పరిపాలన తర్వాత 1,90,797 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వాధికారి నివేదికలో ఉందన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొమ్మిదేళ్ల తర్వాత ఉద్యోగ ఖాళీలు రెట్టింపైన తీరు తెలంగాణ లో పెరిగిన నిరుద్యోగానికి నిదర్శనం అన్నారు. తాను నిరుద్యోగ జంగు సైరన్ పేరుతో ఆందోళన చేపట్టగా, 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేస్తామని చెప్పి ప్రశ్న పత్రాలు లీకేజీలతో నిరుద్యోగులను మోసం చేశారన్నారు.
స్వాతంత్య్రం వచ్చాక ఇంతటి దుర్మార్గ పాలన ఏనాడు లేదన్నారు. ప్రశ్నపత్రాలు అంగట్లో సరుకులాగా మారిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదన్నారు. పరీక్షలు నిర్వహించలేని సన్యాసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. తెలంగాణ మోడల్ అంటే పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీగా తయారైందన్నారు. ఇంకా మహారాష్ట్రలో వెళ్లి సభలు పెడుతున్నారన్నారు. దళిత బంధులో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటూ రాబందులు లాగా కొల్లగొడుతున్నారు అని చెప్పితే ఖండించిన ఆ పార్టీ నాయకులు ఖండించారన్నారు.
స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో 30% కమిషన్లతో మూడు లక్షల తీసుకుంటున్నారని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. కర్ణాటక ప్రభుత్వం 40% కమిషన్లు తీసుకుంటుంది అన్నారు. సీఎం కేసీఆర్ సర్కార్ 30% కమిషన్లు కొల్లగొడుతుందన్నారు. దళితుల పథకంలో కమిషన్లు తీసుకుంటున్న వారు దళితులకు పుట్టారా అని ప్రశ్నిస్తున్నానన్నారు. వారి పాలన రైతులు వ్యవసాయమే చేయాలని, గంగపుత్రులు చేపలు పట్టుకోవాలని, యాదవులు గొర్రెలు కాసుకోవాలని, మాదిగలు చెప్పులు కుట్టుకోవాలన్నట్లుగా, గౌడ్లు ఈదులు గీసుకోవాలి అన్నట్లుగా సాగుతుందన్నారు.
తల్లిదండ్రులు నానా కష్టాలు పడి వయా ప్రయాసలతో పిల్లల్ని చదివిస్తే 9 ఏండ్లుగా వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. దరిద్రుడు, సన్నాసి , తాగుబోతు, లుచ్చా కేసీఆర్ మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుస్తాం అంటున్నాడన్నారు. పరీక్ష పేపర్ల లీకేజ్ తో మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సిన ప్రభుత్వం దానిని పక్కనపెట్టి ఆత్మీయ సమ్మేళనాలు.. పొరుగు రాష్ట్రాల్లో సభల తో రాజకీయం చేస్తుందన్నారు. తాగుబోతు సన్యాసులంతా కలిసి ఒక దగ్గర గుమి గూడిడనట్లుగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు సాగుతున్నాయన్నారు. ఒకవైపు అకాల వర్షాలతో రైతులు నష్టపోతే వారిని పరామర్శించకపోగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సంబరాలు చేసుకుంటున్నారన్నారు
అందుకే రాష్ట్ర రాజకీయాలలో ఏ నిర్ణయం తీసుకున్న ముందుగా నల్లగొండ నుండి ప్రారంభం కావాలన్నారు. నల్గొండ జిల్లా బిడ్డలు ఇక కేసీఆర్ ను ఉద్యోగాలు అడగాల్సిన అవసరం లేదని, కేసీఆర్ ఉద్యోగం పీకితే మన ఉద్యోగాలు మనకు వస్తాయన్నారు. ఇకమీద ఒకే ఆలోచన, ఒకే నిర్ణయం, ఒకే పోరాటం కెసిఆర్, కేటీఆర్ ను బండ కేసు కొట్టి 100 మీటర్ల కింద మీద పెట్టాలన్నారు. అది జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. అందుకు ఈ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలన్నారు. నల్లగొండలో 12 అసెంబ్లీ సీట్లు గెలిపిస్తే రాష్ట్రంలో 100కు 90 సీట్లు గెలిపించే బాధ్యత మాదన్నారు. నిరుద్యోగ యువతకు అండగా ప్రియాంక గాంధీ రానున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డ ప్రియాంక తెలంగాణ గడ్డపై మే 8న కాలు పెడుతున్నారని, వేలాదిగా సరూర్నగర్ తరలిరావాలని కోరారు.
2009లో కేంద్రం తెలంగాణ ప్రకటన వాయిదా వేసినప్పుడు సీఎం కేసీఆర్ ఉద్యమాన్ని తాను ముందుకు తీసుకెళ్లలేను అంటూ జానారెడ్డి ఇంటికి వెళ్లి కాళ్లకు దండం పెట్టి కడుపులో తలపెట్టి జేఏసీ ద్వారా ముందుకు నడపాలని అడిగిన మాట వాస్తవం కాదా అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సాధనకు కేంద్రానికి నివేదించారు అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ పేరుతో రాజీనామాలు చేసి ఎలక్షన్, కలెక్షన్లు పేరుతో మళ్లీ ఓట్లు నోట్లు కొల్లగొట్టిన దొంగ కేసీఆర్ అన్నారు .
తెలంగాణ సాధన ఉద్యమంలో మంత్రి పదవిని విసిరేసిన వెంకట్ రెడ్డి ఈ జిల్లా నాయకుడు అన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పదవి త్యాగం చేసింది కొండ లక్ష్మణ్ బాబుజి అయితే మలిదశ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసిన వెంకటరెడ్డి నల్లగొండ బిడ్డ కావడం గర్వకారణం అన్నారు. నల్గొండ ఎంపీగా వ్యవహరించిన దివంగత సూదిని జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదంలో కీలకంగా వ్యవహరించారన్నారు.
జిల్లా కాంగ్రెస్ నుండి సీనియర్లు, గొప్ప చరిత్ర ఉన్నవారు మంత్రులు అయితే, తెచ్చుకున్న తెలంగాణలో దళారులు, భూకబ్జాదారులు ఇసుక దొంగలు, గనుల దొంగలు, మద్యం వ్యాపారులు ఇవాళ ఎమ్మెల్యేలు అయ్యారు అన్నారు. కెసిఆర్ కు బానిసలుగా మారిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవ్వాల జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అన్నారు. ఈ సభలో ఎంపీలు ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి కే జానారెడ్డి, బిహెచ్ హనుమంతరావు ప్రసంగించారు.