న‌ల్గొండ‌: బొడ్రాయి ఉత్సవంలో ఉద్రిక్తత.. కోమటిరెడ్డి పైకి చెప్పులు, కుర్చీలు

బీఆర్ఎస్‌, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ స‌మావేశం నుంచి అర్ధంత‌రంగా వెనుదిరిగిన కోమ‌టిరెడ్డి గ్రామంలో ఘ‌ర్ష‌ణ‌లు ఉధృతం కాకుండా పోలీస్ పికెట్‌ విధాత: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్న సమావేశంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సమయంలో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉందని, గ్రామానికి వచ్చే రోడ్డు గుంతల మయంగా మారిందని, సీఎం […]

న‌ల్గొండ‌: బొడ్రాయి ఉత్సవంలో ఉద్రిక్తత.. కోమటిరెడ్డి పైకి చెప్పులు, కుర్చీలు
  • బీఆర్ఎస్‌, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌
  • స‌మావేశం నుంచి అర్ధంత‌రంగా వెనుదిరిగిన కోమ‌టిరెడ్డి
  • గ్రామంలో ఘ‌ర్ష‌ణ‌లు ఉధృతం కాకుండా పోలీస్ పికెట్‌

విధాత: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్న సమావేశంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సమయంలో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉందని, గ్రామానికి వచ్చే రోడ్డు గుంతల మయంగా మారిందని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు అప్పుచేసి గ్రామాలకు రోడ్లు కూడా వేయకపోవడం విచారకరమన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తా అని అంటున్నాడని ఎద్దేవా చేశారు. నేను హైదరాబాద్ వెళ్ళాక పంచాయతీరాజ్ మంత్రితో మాట్లాడి గ్రామానికి వచ్చే రోడ్డు మరమ్మతుకు కృషి చేస్తానన్నారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాగ్వివాదానికి దిగగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.

బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు బాహబాహీలతో సమావేశ ప్రాంగణం తోపులాటకు వేదిక అయింది. దీంతో కోమటిరెడ్డి తన ప్రసంగాన్ని నిలిపివేసి అర్ధంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన పైకి చెప్పులు, కర్రలు, కుర్చిలు విసిరి దురుసుగా మీదకు వెళ్లేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకొని ఆయన అక్కడి నుంచి సురక్షితంగా పంపించారు.

గ్రామంలో బొడ్రాయి పండుగ శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ మరింత ముద‌ర‌కుండా పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేశారు.