శారీ రన్ ప్రారంభించిన నారా బ్రాహ్మణి.. పీపుల్స్ ప్లాజాలో ఉత్సాహంగా కార్యక్రమం

తనైరా కంపెనీతో పాటు బెంగళూరుకు చెందిన ఫిట్ నెస్ కంపెనీ జేజే యాక్టివ్ ఆదివారం నిర్వహించిన ‘శారీ రన్’ కార్యక్రమం విజయవంతం అయింది

శారీ రన్ ప్రారంభించిన నారా బ్రాహ్మణి.. పీపుల్స్ ప్లాజాలో ఉత్సాహంగా కార్యక్రమం

వేల సంఖ్యలో హాజరై, పరుగులు తీసిన మహిళలు

తనైరా, జేజే యాక్టివ్ కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్ : తనైరా కంపెనీతో పాటు బెంగళూరుకు చెందిన ఫిట్ నెస్ కంపెనీ జేజే యాక్టివ్ ఆదివారం నిర్వహించిన ‘శారీ రన్’ కార్యక్రమం విజయవంతం అయింది. పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు వేల సంఖ్యలో  పాల్గొన్నారు. దాదాపు 3 వేల మందికి పైగా మహిళలు చీరకట్టులో పరుగులు పెట్టారు. ఉదయం ఆరు గంటల ౩౦ నిమిషాలకు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఈ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో నారా బ్రాహ్మణి మాట్లాడుతూ సంప్రదాయ చీరకట్టుతో మహిళలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని చెప్పారు. చీర కట్టు మహిళా సాధికారికతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు బ్రాహ్మణితో సెల్పీలు తీసుకుంటూ సందడి చేశారు. కార్యక్రమ నిర్వాహకులు తనైరా సీఈవో అంబుజ్ నారాయణ్ మాట్లాడుతూ.. మహిళలకు చీరలు ప్రత్యేక గౌరవాన్ని, హుందాతనాన్ని కల్పిస్తాయని చెప్పారు. జేజే యాక్టివ్ కంపెనీ తరపున కోచ్ ప్రమోద్ తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.