నారాయణ మళ్లీ యాక్టివేట్ అయ్యారా!
తెర వెనక చక్రం తిప్పుతున్నది నిజమేనా!! టచ్‌లో ఉండాలని చంద్రబాబు అందుకే చెప్పారా.. విధాత: టిడిపి హయాంలో కేబినెట్లో చంద్రబాబు తరువాత రెండో క్యాడర్లో ఉంటూ పాలన మొత్తాన్ని కనుసన్నల్లో తిప్పిన నారాయణ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే సైలెంట్ అయ్యారు.. కానీ మళ్లీ ఇప్పుడు తెరవెనుక ఉంటూ పార్టీని నడిపిస్తున్నారని అంటున్నారు. ఈమధ్య జగన్ మీద.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద తీవ్రమైన కామెంట్లు చేసి వివాదాస్పదంగా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే […]

- తెర వెనక చక్రం తిప్పుతున్నది నిజమేనా!!
- టచ్‌లో ఉండాలని చంద్రబాబు అందుకే చెప్పారా..
విధాత: టిడిపి హయాంలో కేబినెట్లో చంద్రబాబు తరువాత రెండో క్యాడర్లో ఉంటూ పాలన మొత్తాన్ని కనుసన్నల్లో తిప్పిన నారాయణ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే సైలెంట్ అయ్యారు.. కానీ మళ్లీ ఇప్పుడు తెరవెనుక ఉంటూ పార్టీని నడిపిస్తున్నారని అంటున్నారు.
ఈమధ్య జగన్ మీద.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద తీవ్రమైన కామెంట్లు చేసి వివాదాస్పదంగా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంటెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినదాన్ని బట్టి చూస్తే నారాయణ మళ్ళీ యాక్టివేట్ అయినట్లు తెలుస్తోంది.
కోటంరెడ్డి మాట్లాడుతూ తనను నారాయణతో టచ్‌లో ఉండాలని చంద్రబాబు చెప్పినట్లు నోరు జారారు. దీన్నిబట్టి చూస్తుంటే మళ్ళీ నారాయణ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నారాయణ టిడిపిలో బాగానే చక్రం తిప్పారు. ఆరోజుల్లో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ స్థానాలకు మొత్తం ఫండింగ్ నారాయణ చేసారని అంటారు.
అందుకే ఆయన ఎన్నికల్లో పోటీ చేయకున్నా ప్రభుత్వం రాగానే చంద్రబాబు ఆయన్ను ఎమ్మెల్సీ పదవిచ్చి ఆ పైన మున్సిపల్ శాఖా మంత్రిగానూ నియమించారు. ఆయన సారథ్యంలోనే అమరావతి రూపకల్పన జరిగింది..
సీఆర్డీఏ చట్టం అమరావతి డిజైన్.. ఇత్యాది పనులన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. అయితే అమరావతి కుంభకోణం అంటూ జగన్ ఆరోపించడం తద్వారా ప్రభుత్వం మారిపోవడంతో నారాయణ మెల్లగా సైలెంట్ అయ్యారు. దానికితోడు జగన్ ప్రభుత్వం వచ్చాక కేసులు కూడా పెట్టడంతో నారాయణ తెరవెనక్కి వెళ్లారు.
ఎక్కడా మీడియాలోనూ కనిపించలేదు.. అయితే మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నారాయణ టిడిపి కార్యకలాపాల్లో బాగా పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. బయటకు పెద్దగా కనిపించకుండా పార్టీకి సంబంధించి పనులన్నీ చక్కబెడుతున్నట్లు అర్థం అవుతోంది. మళ్ళీ ఫండింగ్.. ఇతరత్రా ఏర్పాట్లు కూడా నారాయణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మళ్ళీ టిడిపి ప్రభుత్వం వస్తే నారాయణ కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అందుకే పార్టీలోకి కొత్తగా వచ్చే వాళ్ళు నారాయణతో టచ్‌లో ఉండాలని చంద్రబాబు చెబుతున్నారని అంటున్నారు.