Jayant Patil | NCP నేత జయంత్ పాటిల్‌కు ఈడీ సమన్లు
విధాత: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్, మాజీ మంత్రి జయంత్ పాటిల్ (Jayant Patil) కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు జారీచేసింది. శుక్రవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది. ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్‌కు చెందిన రెండు పూర్వ అడిటర్ సంస్థలతోపాటు మరికొన్ని సంస్థల్లో బుధవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దక్షిణ ముంబైలోని […]

విధాత: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్, మాజీ మంత్రి జయంత్ పాటిల్ (Jayant Patil) కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు జారీచేసింది. శుక్రవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది.
ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్‌కు చెందిన రెండు పూర్వ అడిటర్ సంస్థలతోపాటు మరికొన్ని సంస్థల్లో బుధవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉన్నది.